‘బ్యాండ్ బాలు’ మూవీ హీరో కమలాకర్ మృతి
హైదరాబాద్ : వర్థమాన తెలుగు సినీనటుడు కమలాకర్(34) అనారోగ్యంతో కన్నుమూసాడు. నరాలకు చెందిన వ్యాధితో బాధపడుతూ చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం కమలాకర్ బ్యాండ్ బాలు అనే చిత్రంలో నటిస్తున్నారు.
ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన దర్శి మాజీ ఎంపీ కుమారుడైన బూచేపల్లి కమలాకర్ రెడ్డి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సినిమా హీరో కావాలనే అభిరుచితో టాలీవుడ్ తెరంగ్రేటం చేసిన కమలాకర్ ఇప్పటికే అభి, సన్నీ, హాసిని, సంచలనం అనే సినిమాల్లో నటించారు.
ప్రస్తుతం ఆయన బ్యాండ్ బాలు అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో విడుదల కావాల్సి ఉంది. ఈ లోపే ఆయన కన్నుమూసారు. కమలాకర్ ఇప్పటి వరకు నటించిన చిత్రాలకు ఆయనే నిర్మాత కమల్ పిక్చర్స్ పేరుతో ఓ బ్యానర్‌ను స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు.
ఆయన నటించిన 'బ్యాండ్ బాలు' చిత్రం ఆడియో జూన్ నెలలో విడుదలైంది. ఈచిత్రానికి చింతలపూడి వెంకట్ దర్శకుడు. కామ్నా జెఠ్మలానీ హీరోయిన్. బూచేపల్లి వెంకాయమ్మ సమర్పణలో కమల్ పిక్చర్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మించారు. మరికొన్ని రోజుల్లో సినిమా విడుదల అనగా కమలాకర్ మృతి చెందడం యూనిట్ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.


Click it and Unblock the Notifications












