twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మద్యం మత్తులో తెలుగు నటుడి వీరంగం: గర్ల్‌ఫ్రెండుతో కలిసి పోలీస్ స్టేషన్లో రచ్చ రచ్చ!

    |

    తెలుగు సినీ నటుడు నండూరి కిరణ్ రెడ్డి అలియాస్ ఉదయ్ కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కిరణ్ తన గర్ల్‌ఫ్రెండుతో కలిసి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో రచ్చ సృష్టించడంతో పాటు పోలీసులపై దాడికి పాల్పడటమే ఇందుకు కారణం.

    తన గర్ల్‌ఫ్రెండ్ అను గుప్తాతో కలిసి కిరణ్ పీకలదాకా మద్యం సేవించి శుక్రవారం అర్దరాత్రి దాటిన తర్వాత కారులో బయల్దేరారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో తన ముందు వెళుతున్న నిఖిల్ అనే వ్యక్తి కారును ఢీ కొట్టాడు. అనంతరం కిరణ్, అను గెప్తా... నిఖిల్‌తో గొడవ పడుతూ రోడ్డు మీద నానా హంగామా క్రియేట్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని స్టేషన్ తీసుకెళ్లారు.

    పోలీస్ స్టేషన్లో గలాట, దాడి

    పోలీస్ స్టేషన్లో గలాట, దాడి

    మద్యం మత్తులో ఉన్న కిరణ్ పోలీసుల ఎదుటే నిఖిల్ మీద దాడి చేయబోయాడు. అడ్డుకోబోయిన పోలీసులపైనా చేయి చేసుకున్నాడు. మరో వైపు అను గుప్తా పోలీసులను బూతులు తిడుతూ అక్కడ ఉన్న కంప్యూటర్, ఫైల్స్, ఫర్నీచర్‌ను ధ్వంసం చేసింది.

    వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు

    వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు

    ఈ సంఘటనపై మాదాపూర్ ఇన్స్‌స్పెక్టర్ వై నాగేశ్వరరావు మాట్లాడుతూ... ‘కిరణ్, అను ఇద్దరూ మద్యం సేవించారు. రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి కారణం అయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఐపిసి సెక్షన్ 279(రాష్ డ్రైవింగ్), మోటర్ వెహికిల్ యాక్టర్ సెక్షన్ 185 (డ్రంక్ అండ్ డ్రైవింగ్) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినందుకు, డ్యూటీలో ఉన్న అధికారిపై చేయి చేసుకున్నందుకు కూడా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

    గతంలో డ్రగ్స్ కేసులో

    గతంలో డ్రగ్స్ కేసులో

    కిరణ్‌కు డ్రగ్స్ అలవాటు కూడా ఉందని, 2014లో డ్రగ్స్‌తో పట్టుబడి అరెస్టయినట్లు పోలీసులు తెలిపారు. ఇతడిపై కాకినాడ పరిధిలో 9 కేసులు, హైదరాబాద్ పరిధిలో 16 కేసులు ఉన్నట్లు వెల్లడించారు.

    కిరణ్ నటించిన సినిమాలు

    కిరణ్ నటించిన సినిమాలు

    కిరణ్ నటించిన సినిమాల విషయానికొస్తే.... పరారే, యువరాజ్యం, ఫేస్‌బుక్‌, రాక్షసులు తదితర తెలుగు సినిమాల్లో నటించాడు.

    English summary
    Nanduri Uday Kiran aka Kiran Reddy who was an accused in several cases in Hyderabad and Kakinada including a POCSO Act offence, was arrested by the Madhapur police on Saturday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X