సినీనటుడు నర్రా వెంకటేశ్వరరావు మృతి
ప్రముఖ సినీ నటుడు నర్రా వెంకటేశ్వరరావు(62) ఈ రోజు(ఆదివారం) ఉదయం ఆయన స్వగృహంలో 5.30 నిమిషాలకు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. సుమారు 500 చిత్రాల్లో నటించిన నర్రా వెంకటేశ్వరరావు 1947లో ప్రకాశం జిల్లా అగ్రహారంలో జన్మించారు. ఆయన తొలి చిత్రం 'మల్లెల మనసులు'. అలాగే చివరి చిత్రం మేస్త్రీ(దాసరి). తొలుత సినిమాల్లో విలన్‌గా చేసినా అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నేటి భారతం చిత్రంలో ఆయన నటన ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.అలాగే ఆయన మంచి ఆర్టిస్టుగానే కాక పరిశ్రమలో వివాదరహితుడుగా, మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో జరుగుతాయి. ఆయన మృతికి ధట్స్ తెలుగు నివాళులు అర్పిస్తోంది.
More from Filmibeat
దాసరి మేస్త్రి నర్రా వెంకటేశ్వరరావు మల్లెల మనస్సులు ప్రకాశం జిల్లా ఒసేయ్ రాములమ్మ ప్రతిఘటన క్యారెక్టర్ ఆర్టిస్టు narra venkateswara rao mallala manasulu mestri dasari prakasam dist


Click it and Unblock the Notifications











