Pushpaలో ఆ పాత్ర కోసం సుహాస్ ప్రయత్నం.. ఆడిషన్స్ కోసం వెళ్లగా చేదు అనుభవం!

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప ఫస్ట్ పార్ట్ ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సెకండ్ పార్ట్ కోసం కూడా ప్రస్తుతం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో అవకాశం కోసం చాలామంది ప్రయత్నాలు చేశారు. ఆడిషన్స్ నిర్వహించినప్పుడు కొంతమంది ఆల్రెడీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నవారు కూడా ఆ ఆడిషన్స్ లో పాల్గొన్నారు. అయితే అందులో సుహాస్ కూడా ఉన్నాడు ఆ విషయాన్ని ఇటీవల చిన్న ఇంటర్వ్యూలో అతను తెలియజేశాడు. అలాగే ఒక చేదు అనుభవం ఎదురైనట్లుగా కూడా అతను వివరణ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

అంతకుమించి అనేలా రిలీజ్ చేయాలని..

అంతకుమించి అనేలా రిలీజ్ చేయాలని..

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా అసలు మొదట పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అవుతుంది అని ఎవరు ఊహించలేదు. అల్లు అర్జున్ కెరీర్ లోనే కాకుండా సుకుమార్ స్థాయిని కూడా ఈ సినిమా ఒక్కసారిగా పెంచేసింది. ఇక ప్రస్తుతం సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండో భాగాన్ని అంతకుమించి అనేలా రిలీజ్ చేయాలి అని మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో ఖర్చు చేస్తోంది.

 పుష్ప కోసం ఆడిషన్స్

పుష్ప కోసం ఆడిషన్స్

ఇక పుష్ప ఫస్ట్ పార్ట్ ను మాత్రమే కాకుండా సెకండ్ పార్ట్ కోసం కూడా చాలా సార్లు చిత్ర యూనిట్ సభ్యులు ఆడిషన్స్ నిర్వహించారు. దర్శకుడు సుకుమార్ వీలైనంతవరకు ఈ సినిమాలో ఎక్కువ స్థాయిలో కొత్త తరహా నటీనటులు ఉండేలా చూసుకోవాలని అనుకున్నాడు. ముఖ్యంగా కేశవ పాత్ర ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

కేశవా పాత్ర కోసం

కేశవా పాత్ర కోసం

మొదట ఫస్ట్ పార్ట్ కోసం ఈ సినిమాలో కేశవ పాత్ర కోసం చాలామంది సినీ నటులు పేర్లు చర్చల్లోకి వచ్చాయి. అయితే దాదాపు ఒక నటుడు ఫైనల్ అని కూడా అనుకున్నారు. కానీ సుకుమార్ ఎందుకో కాంప్రమైజ్ కాలేదు. అందుకే మళ్ళీ ఆడిషన్స్ నిర్వహించాలని ఫిక్స్ అయ్యాడు. అయితే ఆడిషన్స్ నిర్వహించడంతో కేశవ పాత్రకు జగదీష్ ఫిక్స్ అయ్యాడు. అతను అంతకుముందు మల్లేశం, జార్జిరెడ్డి సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకున్నాడు.

ఆ పాత్ర కోసం ఆడిషన్స్ లో..

ఆ పాత్ర కోసం ఆడిషన్స్ లో..

అయితే కేశవ పాత్ర కోసం మరో నటుడు సుహాస్ కూడా వెళ్లినట్లు ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం. అయితే ఆ పాత్రలో హీరోగా ఫ్రెండ్ గా ఎలాగైనా నటించాలని అతను చాలా ప్రయత్నాలు చేశాడట. కానీ ఆడిషన్స్ నిర్వహించిన తర్వాత ఎందుకో సెలెక్ట్ కాలేదు అని అన్నాడు. ఇక సుకుమార్ అల్లు అర్జున్ అంటే తనకు నచ్చిన కాంబినేషన్ అని కానీ ఆడిషన్స్ లో లక్కు కలిసి రాలేదు అని వివరణ ఇచ్చాడు.

చేదు అనుభవం..

చేదు అనుభవం..

ఆ తర్వాత కలర్ ఫోటో సినిమాకు గాను అల్లు అర్జున్ ద్వారానే ఫిలిమ్ ఫేర్ అవార్డు కూడా సొంతం చేసుకున్నట్లు సుహాస్ తెలియజేసాడు. ఇక మొదట హీరోగా అసలు నేను పనికొస్తానా అని చాలామంది కామెంట్ చేశారు. ఆఖరికి నాకు కూడా అదే అనిపించింది. మళ్ళీ హీరోగా వర్కౌట్ కాకపోతే వచ్చే చిన్న చిన్న పాత్రలు కూడా రావేమో అని అనుకున్నాను.. అని సుహాస్ చేదు అనుభవాలను షేర్ చేసుకున్నాడు. ఇక కలర్ ఫొటో నాకు ధైర్యాన్ని ఇచ్చింది అని.. ఇక ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ పై కూడా నమ్మకం ఉంది.. అని సుహాస్ తెలియజేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X