»   » హీరోయిన్ మీద లైంగిక వేధింపులు: హీరోను తప్పించే ప్రయత్నం జరుగుతోందా?

హీరోయిన్ మీద లైంగిక వేధింపులు: హీరోను తప్పించే ప్రయత్నం జరుగుతోందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల విజయవాడల సమీపంలో జరిగిన ఓ సంఘటన తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ కోసం అని తీసుకెళ్లి తెలుగు హీరోయన్ మీద దర్శకుడు, హీరో కలిసి అత్యాచారయత్నం చేశారని, లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపించాయి.

వారి బారి నుండి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించిన సదరు నటి తనపై అఘాయిత్యానికి పాల్పడబోయిన ఆ ఇద్దరిపై కేసు పెట్టతింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.... సినిమా అవకాశం పేరుతో తనను నమ్మించిన దర్శకుడు చలపతి, హీరో సృజన్ భీమవరంలో షూటింగ్ ఉందని చెప్పి హైదరాబాద్ నుండి కారులో తీసుకెళ్లారని, కారులో వెళ్తున్న సమయంలోనే అసభ్యంగా ప్రవర్తించారని, అత్యాచారయత్నం చేశారని ఆరోపించారు.

కేసు తప్పుతోవ పడుతోంది

కేసు తప్పుతోవ పడుతోంది

అయితే ఈ కేసు తప్పుతోవ పడుతోందని బాధి హీరోయిన్ తెలిపారు. ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ విజయవాడ పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిన సృజన్ ను వదిలేసి, మరో వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారని ఆరోపించింది.

Sunil and N Shankar Movie Opening... | Sunil | Tollywood |
సృజన్ నుండి ప్రాణహాని ఉంది

సృజన్ నుండి ప్రాణహాని ఉంది

సృజన్ ను తప్పించేందుకు అరెస్ట్ చేసిన వ్యక్తికి ముసుగు కట్టి జైలుకు తరలించారని, సృజన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

సృజన్ తరుపు లాయర్ ఆరోపణల్లో నిజం లేదు

సృజన్ తరుపు లాయర్ ఆరోపణల్లో నిజం లేదు

డబ్బుల కోసమే తాను కేసు పెట్టిందంటూ సృజన్ తరపు న్యాయవాది చేసిన ఆరోపణలను బాధిత హీరోయిన్ ఖండించారు. ఈ కేసులో తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు.

నిడమానూరు వద్ద సంఘటన

నిడమానూరు వద్ద సంఘటన

గతవారం నిడమానూ వద్ద హీరోయిన్ మీద కీచక పర్వం సంఘటన చోటు చేసకుంది. వారి కీచక చర్య నుండి తప్పించుకునే క్రమంలో నటి ప్రతిఘటనకు దిగడంతో పెనుగులాట జరిగి నిడమానూరు వద్ద కారు ప్రమాదానికి గురైంది. గాయాలపాలైన ఆమె వెంటనే అక్కడి నుండి తప్పించుకున్నట్లు మీడియా తెలిపారు.

కేసు పెట్టకుండా బెదిరింపులు

కేసు పెట్టకుండా బెదిరింపులు

ఈ సంఘటన అనంతరం నటి మీడియాతో మాట్లాడుతూ... జరిగిన సంఘటన ఎవరికీ చెప్పొద్దని తనను బ్లాక్ మెయిల్ చేశారని, ఎవరికైనా చెబితే నీ కెరీరే నాశనం అవుతుంది, నీకు ఎవరూ ఛాన్స్ ఇవ్వరు అని బెదిరించారని నటి ఆరోపించిన సంగతి తెలిసిందే.

English summary
Telugu actress assault case is misleading. An upcoming heroine has accused a Telugu film director and an actor of attempt to rape. She said that in the name of film shooting at Bheemavaram, the director and the actor had attempted to rape her on Tuesday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu