డ్రగ్ కేసులో అడ్డంగా బుక్కైన హేమ.. ఇక ఫాం హౌస్ లో బిర్యానీ కథ ఏంటో
బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు, కన్నడ ఇండస్ట్రీలలో దుమారం రేపుతోంది. ఈ ఈవెంట్‌కు సినీ ప్రముఖులు, బుల్లితెర నటులు, మోడల్స్ హాజరైనట్లుగా వార్తలు రావడంతో ఆ పార్టీకి ఎవరెవరు హాజరయ్యారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. తెలుగు నటి హేమ పోలీసులకు చిక్కినవారిలో ఉన్నట్లుగా వార్తలు వచ్చిన కాసేపటికే ఆమె స్పందించింది. ఓ వీడియో బైట్ ద్వారా తాను హైదరాబాద్‌లోనే చిల్ అవుతున్నానని.. రేవ్ పార్టీకి వెళ్లలేదని క్లారిటీ ఇచ్చింది.
కానీ పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారు. హేమ తన కుటుంబ సభ్యులకు విషయం చెబుతానంటే ఫోన్ ఇచ్చామని.. దాని సాయంతో ఓ వీడియో తీసి ప్రజలను తప్పుదోవ పట్టించిందని మండిపడ్డారు. హేమ తమ అదుపులోనే ఉందని , ఆవిడ డ్రగ్స్ తీసుకుందా లేదా అనేది తేల్చేందుకు పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు.

ఈ నేపథ్యంలో హేమ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. ఆమె సహా దాదాపు 86 మంది రేవ్ పార్టీలో డ్రగ్స్ సేవించినట్లు టెస్టుల్లో పాజిటివ్‌గా తేలినట్లు జాతీయ వార్తాసంస్థ ఇండియా టుడే నివేదించింది. ఈ పార్టీకి 73 మంది పురుషులు, 30 మంది మహిళలు హాజరైనట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. మొత్తం మీద 103 మందిలో 86 మంది డ్రగ్స్ వాడినట్లుగా నిర్ధారణ జరిగింది. బ్లడ్ శాంపిల్స్ పాజిటివ్‌గా తేలినవారికి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) నోటీసులు జారీ చేస్తుంది.
తొలుత ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు దర్యాప్తు చేసిన రేవ్ పార్టీ కేసును సీసీబీ స్వాధీనం చేసుకునే ముందు హెబ్బగోడి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసి 104 మందిపై కేసు నమోదు చేశారు. రేవ్ పార్టీపై దాడి సందర్భంగా 14.40 గ్రాముల ఎండీఎంఏ మాత్రలు.. 1.16 గ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్స్.. 6 గ్రాముల హైడ్రో గంజాయి.. 5 గ్రాముల కొకైన్.. కొకైన్ పూసిన రూ.500 నోటు.. 6 గ్రాముల హైడ్రో గంజా.. 5 మొబైల్ ఫోన్లు, రెండు వాహనాలు, ఒక వ్యోక్స్‌వ్యాగన్‌ను , రూ.1.5 కోట్ల విలువైన సౌండ్ అండ్ లైటింగ్ సిస్టమ్‌తో పాటు డీజే పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మే 20న రేవ్ పార్టీపై క్రైం బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించగా.. అర్ధరాత్రి 2 గంటల తర్వాత కూడా బర్త్ డే పార్టీ పేరుతో ఈ కార్యక్రమం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. రేవ్ పార్టీకి హాజరైన ఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో మరో తెలుగు నటి ఆషి రాయ్ ఒకరు. తాను పార్టీకి హాజరైనప్పటికీ తనకు లోపల ఏం జరుగుతుందో తెలియదన్నారు. పార్టీకి వేదికగా నిలిచిన ఫాంహౌస్ .. కాన్ కార్డ్ యజమాని గోపాలరెడ్డికి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని నిర్వహించినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు.. బ్లడ్ శాంపిల్స్ టెస్టులో డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ కావడంతో హేమ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే వీడియో బైట్ రిలీజ్ చేసి తనకేం తెలియదని చెప్పగా.. చివరికి అది అబద్ధమని తేలడంతో హేమపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











