షూటింగుల బిజీల్లోను పరీక్ష రాసిన నటి హేమ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటిమణుల్లో హేమ ఒకరు. ఇటీవల కాలంలో హేమకు కూడా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ గట్టిగానే పెరుగుతున్నారు. ఆమెకు సంబంధించిన రేర్ ఫొటోలు కూడా బాగానే వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె ఎక్కడైనా బయట కనిపించినా కూడా ఆ ఫొటోలపై కథనాలు వెలువడుతున్నాయి. ఇక రీసెంట్ గా ఈ సీనియర్ నటీమణి ఎగ్జామ్ హల్ లో పెన్ను పేపర్ పట్టుకొని దర్శనమిచ్చింది.

Recommended Video

53 Years Old Actress Hema Writes Entrance Exam For Ambedkar Open University | Oneindia Telugu
బిజీగా ఉండే నటి

బిజీగా ఉండే నటి

ఆమె పిల్లలు ఎవరైనా పరీక్ష రాయడానికి వస్తే తోడుగా వచ్చిందేమో అని చాలా మంది అనుకున్నారు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉండే నటి నిజంగానే సొంతంగా పరీక్ష రాయడానికి హాల్ టికెట్ తో పరీక్ష హాల్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వయసులో హేమ పరీక్షలు రాయడం ఏమిటని కొందరు ఆశ్చర్యపోతున్నారు.

డిగ్రీలో ప్రవేశం పొందేందుకు..

డిగ్రీలో ప్రవేశం పొందేందుకు..

అసలు మ్యాటర్ లోకి వెళితే, డిగ్రీలో ప్రవేశం పొందేందుకు నిర్దేశించిన విద్యార్హతలు లేని వారికి అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇక ఆదివారం నల్గొండలో నిర్వహించిన డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం అర్హత పరీక్ష కోసం 580 మంది హాజరయ్యారు. అందులో సినీ నటి హేమ కూడా ఉన్నారు. సినీ నటి హేమను చూసి అక్కడ చాలా మంది కొంత సేపటివరకు ఆశ్చర్యపోయారు.

 కంప్యూటర్‌ కోర్సులు కూడా

కంప్యూటర్‌ కోర్సులు కూడా


రామోజీఫిల్మ్‌సిటీలో ‘కొండాపురం' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న హేమ దగ్గరగా ఉంటుందని పరీక్ష కేంద్రంగా నల్గొండను ఎంచుకొన్నట్లు తెలియజేశారు. ఇక గత రెండేళ్లుగా డిగ్రీ ప్రవేశం కోసం అర్హత పరీక్ష రాసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికి వీలు కాలేదని తెలిపిన హేమ.. కంప్యూటర్‌ కోర్సులు కూడా ఇంకా నేర్చుకోవాలని ఉన్నట్లు వివరణ ఇచ్చారు.

 సినిమాల కోసం చదువును పక్కనపెట్టి..

సినిమాల కోసం చదువును పక్కనపెట్టి..

హేమ యుక్తవయసులో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. వరుసగా ఆఫర్లు డక్కడంతో ఆమె తన చదువును పూర్తి చేయలేకపోయింది. కేవలం ఏడవ తరగతి వరకు మాత్రమే తన చదువును కొనసాగించిందట. ఇక చాలా కాలం తరువాత హేమ ఎలాగైనా డిగ్రీ పట్టా పొందాలని ఈ విధంగా సరికొత్త నిర్ణయం తీసుకుంది.

 2014 రాజకీయాల్లో హేమ..

2014 రాజకీయాల్లో హేమ..

ఇక హేమ అసలు పేరు కృష్ణ వేణి. ఆంధ్రప్రదేశ్ యొక్క తూర్పు గోదావరి జిల్లాలోని రాజోల్ కు చెందిన హేమా ఇప్పటివరకు దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించింది. ఇమా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. హేమా రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. 2014 లో, కిరణ్ కుమార్ రెడ్డి యొక్క జై సమైక్యాంధ్ర పార్టీలో చేరిన ఆమె మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి దిగి ఓడిమిపాలైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X