»   » తెలుగు హీరోయిన్ కంప్లైంట్: హోటల్ రూమ్ లో లైంగిక వేధింపు

తెలుగు హీరోయిన్ కంప్లైంట్: హోటల్ రూమ్ లో లైంగిక వేధింపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: తెలుగులో ఆకాష్ తో దొంగ ప్రేమ చిత్రం చేస్తున్న ఖుషీ ముఖర్జీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ఆమె భూపాల్ లో ఓ హోటల్ లో ఉన్నప్పుడు మైనర్ ఏజ్ కుర్రాడు ఒకడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని, పలుచోట్లు తను నిద్రపోతున్నప్పుడు టచ్ చేసాడని ఆరోపించింది.అంతేకాదు ఈ వ్యవహారం మొత్తం టీవీ ఛానెల్ కు ఎక్కింది. ఈటీవి వారు అక్కడ లోకల్ గా కవర్ చేసారు. హోటల్ స్టాఫ్ ని, ఈ హీరోయిన్ ని పేస్ టు ఫేస్ పెట్టి మాట్లాడించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఖషీ ముఖర్జీ మాట్లాడుతూ...తాను ఓ బాలీవుడ్ చిత్రం కోసం భూపాల్ ఎమ్.పి నగర్ లో ని హోటల్ అమర్ విలాస్ లో రూమ్ నెంబర్ 602లో దిగానని అక్కడే ఈ సంఘటన చోటు చేసుకుందని అన్నారు. ఆమె ఇచ్చిన కంప్లైంట్ లో ...తాను హోటల్ రూమ్ లో పడుకుని ఉన్నప్పుడు.. శుక్రవారం మూడు గంటలకు హోటలకు చెందిన బోయ్...తన గదిలోకి అక్రమంగా ప్రవేశించి...తనతో ఇండీసెంట్ గా బిహేవ్ చేస్తూ... తాక రాని చోట్ల తాకారని అన్నారు. దాంతో పోలీస్ లు సెక్సవుల్ హెరాస్ మెంట్ కేసు,ట్రెస్ పాసింగ్ కేసు ఆ కుర్రాడిపై నమోదు చేసారు.

Telugu actress Khushi Mukherjee claims being molested by under-age hotel employee

అయితే ఆ హోటల్ బోయ్ మాత్రం అవన్నీ నిరాధారమైనవే అని కొట్టిపారేస్తున్నాడు. తాను ఆరవ ఫ్లోర్ లో డ్యూటీలో ఉన్నప్పుడు...ఆమె రూమ్ ఓపెన్ చేసి ఉండటం గమనించానని, ఆమె ఎప్పటిలాగే పూర్తిగా తాగేసి ఉందని అన్నాడు. అలాగే... తలుపు దగ్గరగా ఆమె నేలపై పడుకుని ఉందని చెప్పుకొచ్చారు. ఈ విషయం తాను రిసెప్షన్ లో తెలియచేసానని, ఆమెను నిద్రనుంచి లేపటానికే ఆ గదిలోకి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు.

అలాగే హోటల్ మేనేజర్ అబ్దుల్ జమీర్ మాట్లాడుతూ..ముఖర్జీ తన సినిమా పబ్లిసిటీ కోసం తమ హోటల్ పరువు తీసే ప్రయత్నం చేస్తోందని వాపోయరు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేసారు.

ముఖర్జీ మాత్రం...తనను ఆ కుర్రాడు ఫాలో చేస్తున్నాడని గత పది రోజులుగా అని అన్నారు. అలాగే... ఇంతకు ముందు తనంటే ఇష్టమని ఆ కుర్రాడు చెప్పినట్లు అన్నారు. నేను గట్టిగా గదమగానే..ఆ కుర్రాడు పరిగెత్తుకు పారిపోయాడు. మిగతా గదుల్లో ఉన్న వాళ్లు నా కేకలు విన్నారని,వాళ్లు క్రిందకు దిగుతున్న ఆ పిల్లాడని చూసారని ఆమె అన్నారు. వెంటనే నేను రిసెప్షన్ లో జరిగిన విషయం వివరించి...పోలీస్ ల దగ్గరకి వెళ్లానని అన్నారు. 

English summary
Telugu actress Khushi Mukherjee who is currently shooting in Bhopal, accused an under-age hotel employee of touching her "inappropriately" while she was asleep in her room.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu