twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలనాటి మేటి హీరోయిన్ కృష్ణకుమారి కన్నుమూత

    By Pratap
    |

    Recommended Video

    అలనాటి మేటి హీరోయన్ కృష్ణ కుమారి కన్నుమూత

    హైదరాబాద్: అలనాటి నటి కృష్ణకుమారి కన్ను మూశారు. ఆమె వయస్సు 83 ఏళ్లు. ఆమె 1933 మార్చి 6వ తేదీన పశ్చిమ బెంగాల్‌లోని నైహతిలో జన్మించారు. ఆమె తెలుగులో 130కి పైగా సినిమాల్లో నటించారు.

    ప్రముఖ నటి సావిత్రికి సమకాలీనురాలైన కృష్ణకుమారి అప్పటి అగ్ర హీరోలందరి సరనసన నటించారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, కృష్ణంరాజు, డాక్టర్ రాజ్‌కుమార్, శివాజీ గణేషన్, జగ్గయ్య వంటి హీరోలందరి పక్కన నటించి ప్రేక్షకులను అలరించారు.

    Telugu actress Krishna Kumari passes away

    ఆమె తల్లిదండ్రులు తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వెంకోజీరావు, సచీదేవి. ఆమె కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందింది. ఆమె సోదరి షావుకారు జానికి కూడా అప్పట్లో తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా అలరించారు.

    కృష్ణకుమారి సినీ రంగ ప్రవేశం 1951లో నవ్వితే నవ్వారు సినిమాతో ప్రారంభమైంది. పలు తమిళ సినిమాల్లో కూడా ఆమె నటించారు. ఆమె నటించిన భార్యాభర్తలు (1961), వాగ్దానం (1961), కులగోత్రాలు (1962), గుడి గంటలు (1964) సినిమాలు క్లాసిక్స్‌గా ప్రసిద్ధి గాంచాయి.

    కన్నడంలో చాలా తక్కువ సినిమాలే చేసినప్పటికీ ఎక్కువగా రాజ్‌కుమార్ సరసన నటించారు. ఆమె ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మాజీ సంపాదకుడు, స్క్రీన్ మ్యాగజైన్ వ్యవస్థాపకుడు, వ్యాపారవేత్త అజయ్ మోహన్ ఖైతాన్‌ను వివాహమాడారు. ఆమె తన కూతురు, అల్లుడు, మనవళ్లతో బెంగళూరులో నివసిస్తూ వచ్చారు.

    English summary
    Telugu cinee actress Krishna Kumari passed away, She was the contemporary of Savitri in Telugu Film world.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X