బాలయ్యపై హీరోయిన్ మాధవి సంచలన వ్యాఖ్యలు: రౌడీ.. బొ** గెటౌట్ అంటూ ఘాటుగా!

తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా హవాను చూపిస్తూ బడా హీరోగా దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఆరు పదుల వయసులోనూ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక, ఇటీవలే టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్ట్ అవడంతో బాలయ్య రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాలకు సైతం హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళ్తే..

భరోసా కల్పించేందుకు : ఇటీవలే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నాయకులకు, కార్యకర్తలకు భరోసాను కల్పించేందుకు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే కొన్ని ప్రెస్‌మీట్లు పెట్టి క్యాడర్‌లో ధైర్యాన్ని నింపే ప్రయత్నాలు చేస్తున్నారు.

Telugu Actress Maadhavi Latha Latest Post on Balakrishna Creates Controversy

అసెంబ్లీలో రచ్చ చేసి : తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన నందమూరి బాలకృష్ణ తాజా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. మొదటి రోజు స్పీకర్ పోడియం ఎక్కి మరీ చంద్రబాబు అరెస్ట్ విషయంలో తన నిరసనను తెలియజేశారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలతో గొడవలకు దిగారు. అనంతరం బయటకు వస్తూ బాలయ్య చేతితో ఓ సైగ చేశారు. ఈ వీడియో యమ వైరల్ అయిపోయింది.

బాలయ్యపై విమర్శలు : అసెంబ్లీలో బాలయ్య చేసిన సైగలు అసభ్యంగా ఉన్నాయని విమర్శిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనపై మాటల దాడికి దిగారు. అదే సమయంలో కొందరు నెటిజన్లు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలుగు హీరోయిన్ మాధవి లత దీనిపై స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియా ఖాతాలో ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Telugu Actress Maadhavi Latha Latest Post on Balakrishna Creates Controversy

ఎన్నుకున్న రౌడీలని : నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన సైగలకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన హీరోయిన్ మాధవి లత.. 'ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్న రౌడీలు. సారీ.. నేను తప్పు చెప్పాను. వీళ్లను ఎమ్మెల్యేలు అంటారు అనుకుంటా కదా' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక్కసారిగా బాలయ్యనే అంత మాట అనడంతో ఇప్పుడీమె వ్యాఖ్యలు వివాదంగా మారాయి.

ఎలా చదవాలి అంటూ : సోషల్ మీడియాలో మాధవి లత చేసిన పోస్టుపై నందమూరి బాలకృష్ణ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అందులో 'రౌడీలు' అని రాయడంతో వాళ్లంతా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దీంతో మాధవి లత స్పందిస్తూ.. 'హహహ.. ప్రతివాడూ తనకు నచ్చేలా పోస్ట్ చేయాలని ఆశ పడతాడు. మరి 5 లక్షల మెంటాలిటీలను ఎలా చదవాలి' అని రాసింది.

Telugu Actress Maadhavi Latha Latest Post on Balakrishna Creates Controversy

బొచ్చులోది గెటౌట్ : ఇదే పోస్టులో మాధవి లత.. 'బొచ్చులోది ఇది నా పేజ్. నాకు నచ్చిందే పెడతాను. నాకు 360 డిగ్రీల్లోనూ పర్‌ఫెక్ట్ అనుకున్న దానినే పోస్ట్ చేస్తాను. నా దేవుడు కృష్ణుడు చెప్పిన రాజనీతిని పెడతాను. ఉంటే ఉండండి.. చస్తే చావండి నాకేంటి? గెటౌట్' అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమెపై ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X