»   » నా అవార్డు అనుష్కకి, అక్కడ రాజకీయాలున్నాయ్: నంది అవార్డుపై హీరోయిన్‌

నా అవార్డు అనుష్కకి, అక్కడ రాజకీయాలున్నాయ్: నంది అవార్డుపై హీరోయిన్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    నచ్చావులే, స్నేహితుడా వంటి సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించిన మాధవీలత గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. చిన్న సినిమాల్లో కనిపించి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నప్పటికీ అప్పట్లో మాధవీలతకు ఆఫర్లు అంతగా రాలేదు. దీంతో తమిళ మూవీస్‌లో ట్రై చేసినా అక్కడా సక్సెస్ కాలేదు. అలా హీరోయిన్‌గా ఫేడవుట్ అయిన మాధవి, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ బోలెడు ఫాలోవర్లను సంపాదించుకుంది.ఇదంతా పక్కన పెడితే అసలు తాను వెండితెరకు ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. రెండుభాగాలుగా వచ్చిన ఈ ఇంటర్వ్యూలోంచి కొన్ని విషయాలు

    కర్ణాటకలో పుట్టి

    కర్ణాటకలో పుట్టి

    పెరిగిన మాధవీ లత మొదటి సినిమాతోనే మంచి టాలెంట్ కలిగిన నటి అని గుర్తింపు తెచ్చుకుంది. అయితే అంత టాలెంట్ ఉండి అయిదారు సినిమాలకే కనిపించకుండా పోయింది. "నచ్చావులే' సినిమా తర్వాత నానితో కలిసి 'స్నేహితుడా' సినిమాలో మెరిసిన మాధవీలత తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసినా కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.

    దాంతో దాదాపుగా

    దాంతో దాదాపుగా

    సినిమాలకు దూరం అయిపోయింది. ఇకపోతే, రీసెంట్ గా ఓ షార్ట్ ఫిలింలో నటించి అలరించిన మాధవీలత.. ఫేస్ బుక్ లో మాత్రం అభిమానులను సంపాదించుకుని బాగానే సందడి చేస్తోంది. ఆమె తాజాగా ఐ డ్రీమ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న ఎన్నో చేదు విషయాలు, వాటి వెనుక ఉన్న కఠిన వాస్తవాలను ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ ప్రోగ్రాం లో రివీల్ చేసింది.

    మొదటి సినిమా

    మొదటి సినిమా

    ‘నా మొదటి సినిమా టైమ్‌లో నంది అవార్డు ఫైనల్‌ లిస్ట్‌లో నా పేరు ఉందని కొంతమంది జ్యూరీ మెంబర్లు చెప్పారు. నాతోపాటు అనుష్క (అరుంధతి), స్వాతి ‘అష్టాచెమ్మా' ఫైనల్‌ లిస్టులో ఉన్నారు. కానీ, నాకు అవార్డు ఇవ్వకుండా బెస్ట్‌ హీరోయిన్‌గా అనుష్కకు, ఉత్తమ తొలి చిత్ర కథానాయికగా స్వాతికి అవార్డు ఇచ్చారు.

    నాకు ఇవ్వకపోవడానికి చెప్పిన రీజన్‌ ఏంటంటే..

    నాకు ఇవ్వకపోవడానికి చెప్పిన రీజన్‌ ఏంటంటే..

    ‘నీ సినిమాకు నువ్వు డబ్బింగ్‌ చెప్పుకోలేదు. అందుకే అవార్డు రాలేద'ని చెప్పారు. అది నిజం కాదు.. ఎందుకంటే అనుష్క కూడా డబ్బింగ్‌ చెప్పుకోలేదు. నిజానికి స్వాతి కంటే నేను బాగా యాక్ట్‌ చేశా. ఆ విషయం నాకు తెలుసు.

    అందుకే

    అందుకే

    అప్పటి జ్యూరీ చైర్మన్‌ తమ్మారెడ్డి భరద్వాజగారికి ఫోన్‌ చేసి అడిగా. ఆయన ‘అమ్మా నా మీద బోలెడంత ఒత్తిడి ఉంది. నువ్వు చిన్న పిల్లవు. నీకు తెలియదు. ఇక్కడి రాజకీయాలు నీకు తెలియదు. నా చేతుల్లో ఏమీ లేదని చెప్పార'ని చెప్పింది. అంటే అవార్డుల విషయం లో బయట ఉన్న అపోహలు అపోహలు కాదన్నమాట ని మళ్ళీ ఒక సారి గట్టిగా చెప్పినట్టే.

    ఇక తాను

    ఇక తాను

    సినిమాలకు దూరమవటం గురించి చెబుతూ ఆమె ఇండస్ట్రీ లో ఎవరికీ లొంగకపోవడం వల్లే ఆమెకి ఈ పరిస్థితి వచ్చిందట. ఇండస్ట్రీ లో పెద్ద మనుషులుగా చలామణీ అవుతున్న చాలమంది హీరోయిన్స్ విషయంలో మాత్రం సెక్సువల్ రిలేషన్ కే ప్రాధాన్యత ఇస్తారు అనేలా మాట్లాడింది.

    నేను కనుక

    నేను కనుక

    నోరు విప్పితే ఎంతమంది కాపురాలు కూలిపోతాయంటూ హెచ్చరించింది. దాదాపు ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది సిట్యుయేషన్ ఇదే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాగే తన లవ్ స్టోరీ గురించి, పెళ్లి పై తన ఒపీనియన్ గురించి చెప్పుకొచ్చింది.

    ఒక ప్రొడ్యూసర్

    ఒక ప్రొడ్యూసర్

    ఆమె నో చెప్పినందుకు తనను ఎలా హెరాస్ చేసాడో వివరించింది. లొకేషన్ లో అందరిముందు అరిచేవాడని, ఒకసారి సాంగ్ షూటింగ్ కోసం షార్ట్ డ్రెస్ వేసుకోమంటే వేసుకోకపోవడంతో పెద్ద గొడవ జరిగిందని, ఇంకా తాను ఎదుర్కొన్న ఎన్నో చేదు విషయాలు, వాటి వెనుక ఉన్న కఠిన వాస్తవాలను ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ ప్రోగ్రాం లో రివీల్ చేసింది.

    English summary
    Tollywood Actress Madhavi Latha Who Reveals Her Shocking Harassments In Frankly With TNR
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more