Don't Miss!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- News బాలయ్య ఎన్నికల ప్రచార జోరు: కీలక హామీలు
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వేధింపులు అధిగమించి తెలుగు హీరోయిన్ సంచలనం... ఇపుడు పార్లమెంటులోకి!
రాజకీయ సంచలనం అంటే... ఏదో ఒక పార్టీ టిక్కెట్టు మీద గెలిచి పదవి దక్కించుకోవడం కాదు. ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంటుగా పోటీ చేసి గెలుపొందడమే. అది కూడా దాదాపు 5 సార్లు (30 ఏళ్ల పాటు) గెలిచిన ఒక సీనియర్ నేత మీద అంటే మామూలు విషయం కాదు. హీరోయిన్ నవనీత్ కౌర్ ఈ ఫీట్ సాధించారు.
తెలుగులో పలు చిత్రాల్లో నటించి... మహారాష్ట్రకు చెందిన ఒక రాజకీయ నాయకుడిని పెళ్లాడిన ఆమె తాజాగా మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించి పార్లమెంటులో అడుగు పెట్టారు. ఇటీవల ఎన్నికల్లో ఆమె శివసేన సీనియర్ నేత ఆనందరావు విఠోబాను ఓడించారు.
వేధింపులు, ఇబ్బందులను అధిగమించి
అయితే ఈ గెలుపు ఆమెకు అంత ఈజీగా రాలేదు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె ప్రత్యర్థుల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి వల్ల తాను వేధింపులకు గురైనట్లు కూడా ఆరోపణలు చేశారు. ఆ పరిస్థితులను అధిగమించి ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించారు.
ప్రేమ, పెళ్లి, ఆపై రాజకీయాలు..
నవనీత్ కౌర్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు రవి రాణాను 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు. రవి రాణా బద్నేరా నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తన భార్యకు రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో ఆమెను కూడా ఇందులోకి దింపాడు.
భర్త సహాయంతో....
భర్త ద్వారా రాజకీయ పాఠాలు నేర్చుకున్న నవనీత్ కౌర్.... గత ఐదేళ్లుగా రాజకీయాల్లో చుకురుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ఇపుడు ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టిన తన సత్తా నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. రాజకీయాల్లో ఆమె ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి.
సినిమా రంగంలోకి...
ముంబైకి చెందిన నవనీత్ కౌర్ 2004లో దర్శన్ అనే కన్నడ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. శ్రీను వాసంతి లక్ష్మి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కెరీర్లో 20 సినిమాలు చేసిన ఆమె కేవలం తెలుగులోనే 15 సినిమాలు చేయడం గమనార్హం. అయితే నటిగా కలిసిరాక పోవడంతో పొలిటీషియన్‌ను పెళ్లాడి రాజకీయ రంగంలోకి అడుగు పెట్టి సక్సెస్ అయ్యారు.