దేశంలోనే తొలిసారి ఓ మహిళకు హోం మంత్రి పదవి ఇవ్వడం గొప్ప విషయమని సినీ నటి శారద అన్నారు. అలాంటి నిర్ణయం తీసుకోవడానికి చాలా ధైర్యం కావాలని, వైయస్ ఆమె పొగడ్తల్లో ముంచెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన సందర్భంగా ఆమె ముఖ్యమంత్రిని కలసి అభినందనలు తెలిపారు. మరో నటుడు శ్రీహరి కూడా వైఎస్‌ను కలిశారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ..కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని గతంలోనే తాను చెప్పానని అది నిజమైందని అన్నారు.