నాది లవ్ మ్యారేజ్.. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే అలా చేశాను: క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ
టాలీవుడ్ లో ఒకప్పుడు అమ్మ పాత్రలు చేయాలంటే దర్శకులకు ఎక్కువగా గుర్తొచ్చే నటి సుధ మాత్రమే. అలాగే అత్త, వదిన వంటి సపోర్టింగ్ పాత్రలతో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు హోమ్లీగా ఎంట్రీ ఇచ్చిన సుధ కొన్నాళ్లకె ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో ఆమె తన నిజజీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడారు.

బెస్ట్ మూవీస్..
క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినప్పటికీ సుధ సినిమా ప్రపంచంలో చాలా బిజీగా ఉండేవారు. గ్యాంగ్ లీడర్ సినిమా తరువాత ఆమె బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు. చాలా బాగుంది, అతడు, దూకుడు, బాద్‍షావంటి సినిమాలు ఆమెకు నటిగా మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. ఎక్కువగా సీనియర్ యాక్టర్ చంద్ర మోహన్ కి జోడిగా ఆమె 50కి పైగా సినిమాల్లో నటించారు. అప్పట్లో సుధ అంటే హీరోలకు తల్లి అని అభిమానుల్లో ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.

500 సినిమాలు..
500కి పైగా సినిమాల్లో నటించిన అతి కొద్దీ మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో సుధ ఒకరు. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, అలాగే తమిళ్ లో సూర్య, అజిత్, విశాల్ వంటి హీరోలకు కూడా ఆమె తల్లిగా కనిపించారు. కొంతమంది స్టార్ హీరోలు సుధని ఏరికోరి మరి అమ్మ పాత్రల కోసం ఎంచుకునేవారట. అంతగా ఇండస్ట్రీలో ఆమె మంచి గుర్తింపు దక్కించుకున్నారు.

లవ్ స్టోరీ..
సుధ గ్యాంగ్ లీడర్ సినిమా సమయంలోనే ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొదట్లో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే అలానే మొండిపట్టుతో ఉండేసరికి చివరికి వాళ్లే ఒప్పుకున్నారని సుధ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. చెన్నైలో ఉన్నప్పుడు ఎదురుగా ఉండేవారని ఫ్యామిలీ ఫ్రెండ్ కావడంతో స్నేహం ప్రేమ వరకు వెళ్లిందని అన్నారు. ఇక పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పిన సుధ ఆ తరువాత వాళ్లే ఒప్పుకునేలా చేశామని అన్నారు.
Recommended Video

ఆయన అడ్డు చెప్పలేదు.
మా వారు సినిమాలు చేస్తాను అనగానే ఎలాంటి అడ్డు చెప్పలేదు. పైగా నాకు వచ్చిన పాత్రలు కూడా అలాంటివే అని బహుశా అందుకు ఆయన ఎలాంటి అడ్డు చెప్పకపోయి ఉండవచ్చని అన్నారు. ఇక తనకు ఒక కూతురు ఉందని గతంలో ఉదయ్ కిరణ్ ని దత్తత తీసుకోవాలని ఒకానొక సమయంలో ఆలోచన వచ్చిందని అన్నారు. ఉదయ్ కిరణ్ తో పాటు శ్రీ హరి చనిపోయినప్పుడు చాలా బాధను కలిగించిందని అన్నారు.


Click it and Unblock the Notifications











