ఆ హీరోయిన్ సినిమా తొలిషో మహిళలకు ఉచితం..
ధన 51 సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన భామ సలోని. ఆ తర్వాత ఒక ఊరిలో, చుక్కల్లో చంద్రుడు, కోకిల సినిమాల్లో హీరోయిన్‌గా నటించి తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్త్ తో అందరినీ ఆకట్టుకున్నప్పటికీ...పాపం ఏ సినిమా హిట్ సాధించక పోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు ఈ భామకు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న హిట్ సాధించడంతో మళ్లీ ఫాంలోకి వచ్చింది సలోని. ఈ విజయంతో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది.
విడుదలకు సిద్దమైన సలోని తాజా సినిమా తెలుగమ్మాయి. వైష్ణవి మూవీస్ పతకంపై వన్నెంరెడ్డి దర్శకత్వంలో వానపల్లి రాంబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నేడు(అక్టబర్ 14) విడుదలవుతోంది. ఈ సినిమా తొలి షో మహిళలకు ఉచితంగా చూపించాలని నిర్ణయించారు దర్శక నిర్మాతలు. ఈ మధ్య కాలంలో ఆడవారిపై తరచూ జరుగుతున్న అఘాయిత్యాలను సహించలేక వాటిపై పోరాటం చేసి, వాటికి అంతం పలకడానికి దారి చూపించిన ఒక సాహస వంతురాలిగా సలోని ఇందులో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











