వెరీ హాట్: అసూయ పుట్టిస్తున్న అనసూయ అందం (ఫోటోస్)
హైదరాబాద్: తెలుగు యాంకర్ అనసూయ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించి...అనతి కాలంలోనే తెలుగులో మోస్ట్ పాపులర్ యాంకర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారామె. అందంతో పాటు చలాకీతనం, ఆకట్టుకునే వ్యాఖ్యానం వెరసి అనసూయను తెలుగు టాప్ యాంకర్ల లిస్టులో చేర్చాయి.
న్యూస్ రీడర్‌గా పరిచయమైన అనసూయ 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమా ఆడియో ఫంక్షన్లలో యాంకరింగ్ చేయడంతో పెద్ద సెలబ్రిటీ అయిపోయింది ఈ చలాకీ సుందరి. ప్రస్తుతం ఆమె పలు టీవీ షోలు, వివిధ ఈవెంట్లతో బిజీ బిజీగా గడుపుతోంది.
అనసూయ కంటే సీనియర్ యాంకర్ల సుమ, ఝాన్సీ, శిల్పా, ఉదయభాను తదితరులు కూడా పలు సినిమా ఆడియో ఫంక్షన్లకు, టీవీ షోలకు యాంకరింగ్ చేసినా....అనసూయ మాదిరి ఫాలోయింగ్ సంపాదించుకోలేక పోయారు. సోషల్ నెట్వర్కింగులో అనసూయను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య లక్షల్లో ఉంది.
అనసూయ హాట్ ఫోటో షూట్ల కూడా ఆమె వైపు అందరి దృష్టి పడేలా చేస్తున్నాయి. తాజాగా విడుదలైన అనసూయ హాట్ ఫోటోస్.....ఆమెకు పోటీగా ఈ రంగంలో ఉన్న ఇతర భామలకు అసూయ పుట్టించే విధంగా ఉన్నాయి.

సినిమాల వైపు
ఇప్పటికే కలర్స్ స్వాతి, ఉదయ భానుతో సహా పలువురు యాంకర్లు బుల్లితెరపై తమ టాలెంటు నిరూపించకుని సినిమాల వైపు అడుగులు వేసారు. ఆ బాటలోనే అనసూయ నడుస్తున్నట్లు స్పష్టం అవుతోంది.

గాసిప్స్
సెలబ్రిటీలన్నాక గాసిప్స్ మామూలే. ఈ మధ్య అనసూయపై కూడా ఇలాంటివి వినిపిస్తున్నాయి.

వివాదం
ఆ మధ్య అనసూయ పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం వచ్చిస్తే తిరస్కరించడంతో...పవన్ అభిమానులతో ఆమెకు సోషల్ మీడియాలో చిన్న వివాదం చోటు చేసుకుంది.

నాగార్జున మరదలిగా?
అక్కినేని నాగార్జున నటిస్తున్న కొత్త చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా'. ఈ సినిమాలో నాగార్జున మరదలి పాత్రలో అనసూయ నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

రెమ్యూనరేషన్
తెలుగు యాంకర్లలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే వాళ్లలో అనసూయ కూడా ఒకరు. ఒక్కో ఈవెంటుకు లక్షల్లో తీసుకుంటుందట.


Click it and Unblock the Notifications











