twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్కడ విజయ్ దేవరకొండ కుమ్మేశాడు.. కానీ ఇక్కడే ‘కామ్రేడ్’ తగ్గాడు..

    By Manoj Kumar P
    |

    విజయ్ దేవరకొండ.. ఈ పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ సంచలనం. 'పెళ్లి చూపులు' అనే సినిమాలో డీసెంట్‌గా కనిపించిన ఈ యంగ్ హీరో.. 'అర్జున్ రెడ్డి'లో మాత్రం ఎంతో వైలెంట్‌గా కనిపించాడు. టాలీవుడ్‌లో ఈ సినిమా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అప్పటి వరకు మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ పెట్టుకున్న సరిహద్దులను ఈ సినిమా చెరిపివేసింది. దీంతో విజయ్ దేవరకొండ భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎంతో ఫాలోయింగ్‌ను పెంచుకున్న ఈ కుర్ర హీరో.. మరో లెవెల్‌కు వెళ్లే సినిమాలపై దృష్టిపెట్టారు.

    ఎన్నో అంచనాలు కానీ ఫలితం లేదు

    ఎన్నో అంచనాలు కానీ ఫలితం లేదు

    టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా కలిసి నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సీవీఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌ంగా నిర్మించారు. ఈ సినిమాను భరత్ కమ్మ అనే నూతన దర్శకుడు తెరకెక్కించాడు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల అయింది. దీనిని ప్రేక్షకులు ఆదరించలేదు.

    కలెక్షన్ల పరంగా

    కలెక్షన్ల పరంగా

    ‘డియర్ కామ్రేడ్' తొలి రోజు భారీ స్థాయిలో వసూళ్లను సాధించింది. అయితే, సినిమా టాక్ మిశ్రమంగా ఉండడంతో ఆ తర్వాత జోరు తగ్గింది. మొత్తంగా మొదటి వారాంతంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 18.85 కోట్లు(డిస్ట్రిబ్యూటర్ షేర్) వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 12.56 కోట్లు రాబట్టింది. ఇందులో రూ.6.83 కోట్లు మొదటి రోజు వసూలు కావడం గమనార్హం. ఆ తర్వాత విపరీతమైన ప్రతికూలత రావడంతో సినిమా కలెక్షన్లు అనుకున్నంత మేరకు పెరగలేదనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.

    అక్కడ మాత్రం సూపర్ హిట్

    అక్కడ మాత్రం సూపర్ హిట్

    కొద్ది రోజుల క్రితం ‘డియర్ కామ్రేడ్' అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. దీనికి భారీ స్థాయిలో క్లిక్స్ వచ్చాయి. గతంలో ఏ సినిమాకూ రాని స్థాయిలో ‘డియర్ కామ్రేడ్' కుమ్మేసిందని విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. ఈ సినిమాను చాలా మంది చూశారని డిజిటల్ ట్రేడ్ వర్గాలు కూడా వెల్లడించాయి. దీంతో పలు రికార్డులు కూడా బద్దలయ్యాయనే టాక్ కూడా వినిపించింది.

    బుల్లితెరపై ఆకట్టుకొలేని కామ్రేడ్

    బుల్లితెరపై ఆకట్టుకొలేని కామ్రేడ్

    టాలీవుడ్‌లో ఎన్నో అంచనాలతో విడుదలైన డియర్ కామ్రేడ్ సినిమా యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. తాజాగా టెలివిజన్ ప్రీమియర్‌గా వచ్చిన ‘డియర్ కామ్రేడ్' టీఆర్పీ రేటింగులను సైతం రాబట్టుకోలేకపోయింది. ఈ సినిమా అర్బన్‌లో 5.47 రేటింగ్ సాధించింది. అయితే, ఓవరాల్‌గా మాత్రం 4.90 రేటింగ్‌నే దక్కించుకుంది.

    English summary
    Tollywood Young Hero Vijay Deverakonda Upcoming movie is Dear Comrade. Bharat Kamma directed By This Movie. now Dear Comrade censor report was out. The censor Board Given U/A For This Film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X