twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నానికి షాకిచ్చిన తెలుగు ప్రేక్షకులు.. మరీ ఈ స్థాయిలోనా? ఎవరూ ఊహించి ఉండరు.!

    |

    నేచురల్ స్టార్ నాని.. తెలుగు సినీ ఇండస్ట్రీలో మినిమమ్ గ్యారెంటీ హీరో. అందుకే అతడి సినిమా వచ్చిందంటే ప్రతి ఒక్కరూ చూడాలని అనుకుంటారు. ప్రేక్షకుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ యంగ్ హీరో కూడా మంచి సినిమాను అందించాలనే లక్ష్యంతో తన వంతు కృషి చేస్తుంటాడు. అయితే, ఒక్కోసారి అది ఫలిస్తుంది.. ఒక్కోసారి నిరాశకు గురి చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్న నానికి తెలుగు ప్రేక్షకులు ఊహించని షాక్ ఇచ్చారు.

    జెర్సీతో సక్సెస్ ట్రాక్

    జెర్సీతో సక్సెస్ ట్రాక్

    కెరీర్ మంచి ఊపుమీదున్న దశలో ‘కృష్ణార్జున యుద్ధం', ‘దేవదాస్' వంటి చిత్రాలతో వరుస పరాజయాలను చవి చూశాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమాల తర్వాత అతడు నటించిన చిత్రం ‘జెర్సీ'. క్రికెట్ బ్యాగ్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా నానిని మరోసారి హిట్ ట్రాక్ ఎక్కించింది. ఇందులో నాని నటనకు, పలికించిన హావభావాలకు మంచి మార్కులే పడ్డాయి.

    కలెక్షన్లు కూడా..

    కలెక్షన్లు కూడా..

    ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. అన్ని సెంటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల గ్రాస్ సొంతం చేసుకున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. ఓవర్సీస్‌లోనూ నాని సినిమాను బాగానే ఆదరించారు ఎన్నారైలు.

    బుల్లితెరపై మాత్రం

    బుల్లితెరపై మాత్రం

    ‘జెర్సీ' ఘన విజయం సాధించడంతో ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్‌లోనూ భారీ స్పందనను దక్కించుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా చూడడానికి అంతగా ఆసక్తి చూపలేదు. జీ తెలుగు చానెల్‌లో ప్రసారమైన ‘జెర్సీ' కేవలం 8.8 రేటింగును మాత్రమే దక్కించుకుంది. నాని గత చిత్రాలతో పోల్చినా ఇది తక్కువే కావడం విశేషం.

    రికార్డు బాహుబలిదే

    రికార్డు బాహుబలిదే

    టెలివిజన్ ప్రీమియర్‌లో గతంలో ‘మగధీర' 22 రేటింగ్ పాయింట్లు సాధించగా, ఇటీవల దాన్ని ‘బాహుబలి' 22.7తో బీట్ చేసింది. ఆ తర్వాత ‘దువ్వాడ జగన్నాథమ్‌'కు రికార్డు స్థాయిలో 21.7 టీఆర్పీ, ‘శ్రీమంతుడు', ‘ఫిదా' సినిమాలకు 21+ టీఆర్పీ, ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ మూవీకి ‘20.7' టీఆర్పీ వచ్చింది.

    జెర్సీ గురించి

    జెర్సీ గురించి

    అవసరమైన సమయంలో నానికి ‘జెర్సీ' ద్వారా హిట్ వచ్చింది. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమైంది. అలాగే కలెక్షన్ల పరంగానూ ‘జెర్సీ' సూపర్ సక్సెస్ అయింది.

    English summary
    Tollywood Young hero Rana Daggubati become Producer For Natural Star Nani Super Hit Movie Jersey. According to the latest reports, Jersey managed to get a TRP rating of 8.8, which is low.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X