Shahrukh Khan Jawan మూవీలో తెలుగు బిగ్ బాస్ బ్యూటీ.. ఏ క్యారెక్టర్ చేసిందో తెలుసా?

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం జవాన్ థియేటర్ లోకి వచ్చేసింది. మొదటి సారిగా షారుఖ్ సరసన నయనతార నటిస్తోంది. అంతే కాదు ఈ భామ బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఇక జవాన్ మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ అయితే వస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో తెలుగు బిగ్ బాస్ బ్యూటీ ఒక చిన్న పాత్రలో మెరిసింది. ఆమె ఎవరు.. ఏ పాత్రలో నటించిందనే విషయాలు తెలుసుకుందాం.

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ పఠాన్ తర్వాత చేస్తున్న చిత్రం జవాన్. ఈ సినిమాకు తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించగా... లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో విలన్ గా తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించారు. జవాన్ సినిమాలో షారుఖ్ డ్యూయల్ రోల్ లో నటించారు. తండ్రీ కొడుకులగా షారుఖ్ నటన అద్భుతమని అంటున్నారు.

Telugu Bigg Boss beauty Siri Hanumanth To be part of Shahrukh Khan Jawan movie

ఇదిలా ఉంటే జవాన్‌ లో ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్‌ కీలక పాత్రలలో నటించారు. బాలీవుడ్ భామ దీపికా పదుకొనే అతిథి పాత్రలో మెరిసింది. ఇక ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్రన్ అందించిన మ్యూజిక్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఈ మూవీని షారుఖ్‌ ఖాన్‌ హోంబ్యానర్ రెడీ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై గౌరీఖాన్ రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించింది.

Telugu Bigg Boss beauty Siri Hanumanth To be part of Shahrukh Khan Jawan movie

ఇక జవాన్ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. పఠాన్ సినిమా రికార్డును ఈ సినిమా బ్రేక్ చేస్తుందని అంటున్నారు. ఇక మొదటి రోజు ఈ సినిమా దాదాపు రూ.125కోట్లు సాధిస్తుందని ట్రెడ్ వర్గాల అంచనా. ఇండియాలో రూ.80కోట్లు సాధిస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని పఠాన్ సినిమా రికార్డులను కొల్లగొడుతుందని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి.

Telugu Bigg Boss beauty Siri Hanumanth To be part of Shahrukh Khan Jawan movie

అయితే జవాన్ సినిమాలో మన తెలుగు బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్మంతు ఓ పాత్రలో నటించింది. జవాన్ సినిమాలో షారుఖ్ డ్యూయల్ రోల్. ఓ పాత్ర జైలర్ గా కనిపిస్తాడు. జైలర్ ఆజాద్ పాత్రలో షారుఖ్ నటించగా.. ఆయనకు సబ్ ఆర్డినెట్ ఆఫీసర్ గా సిరి హనుమంతు కనిపించింది. ఇక బాలీవుడ్ మూవీలో బిగ్ బాస్ బ్యూటీ చోటు దక్కించుకోవడం గొప్ప విషయమేనని నెటిజన్స్ అంటున్నారు.

Telugu Bigg Boss beauty Siri Hanumanth To be part of Shahrukh Khan Jawan movie

తమిళ దర్శకుడు అట్లీ కూడా మొదట్లో ఈ సినిమాలో చిన్న క్యామియో ఇచ్చారు. ఇక జవాన్ మూవీ పేరుకు బాలీవుడ్ మూవీ అయినా... అంతా సౌత్ వాళ్లే ఉన్నారు. తమిళ దర్శకుడు అట్లీ, హీరోయిన్ నయనతార, విలన్ గా విజయ్ సేతుపతి, ప్రియమణి, యోగి బాబు, సిరి హనుమంతు.. ఇలా మొత్తం సౌత్ వాళ్లనే తీసుకున్నారు. దీనితో ఇది సౌత్ మూవీలా అనిపిస్తుంది. మొత్తానికి షారుఖ్ మళ్లీ భారీ కొట్టబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X