Pragathi: షూటింగ్ లోనే సూటిపోటి మాటలు.. ఏడ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి: క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి

సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా జనాల్లో మంచి ఆదరణ దక్కుతొంది. వారు కూడా మంచి పాత్రలు వస్తే ఏమాత్రం మిస్ చేసుకోకుండా వచ్చిన పాత్రలతో అందరిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరి కొందరు సోషల్ మీడియా ద్వారా కూడా మంచి క్రేజ్ అందుకుంటున్నారు.

అలాంటి వారిలో ప్రగతి కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పాలి. ఎక్కువగా అమ్మ పాత్రలో బాగా పాపులర్ అయిన ప్రగతి సోషల్ మీడియాలో మాత్రం నేటితరం హీరోయిన్స్ తరహాలో చాలా గ్లామరస్ గా కనిపిస్తూ ఉంటారు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇండస్ట్రీలో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను గురించి కూడా తెలియజేశారు.

చాలమంచి ఆఫర్స్

చాలమంచి ఆఫర్స్

నటి ప్రగతి సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు 25 ఏళ్ళు కావస్తోంది. ఆమె మొదట యుక్త వయసులోనే హీరోయిన్ గా కొన్ని సినిమాలు కూడా చేశారు. ముఖ్యంగా తమిళంలో ఆమెకు మొదట్లోనే చాలా మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ హీరోయిన్ గా మాత్రం ఆమెకు సరైన విజయాలు దక్కలేదు. అంతే కాకుండా గ్లామరస్ పాత్రలు కాకుండా ట్రెడిషనల్ లుక్స్ లోనే కనిపించేందుకు ఆమె ఎక్కువగా ఆసక్తిని చూపించారు.

తల్లి పాత్రలలో..

తల్లి పాత్రలలో..

ఇక హీరోయిన్ గా ఆమెకు అనుకున్నంతగా గుర్తింపు రాకపోవడంతో ఆ తర్వాత వెంటనే మళ్ళీ తల్లి పాత్రలు చేసేందుకు ఒప్పుకున్నారు. కొన్ని సమయాల్లో అయితే 25 ఏళ్ల వయసులో కూడా యువ హీరోయిన్స్ కు ఆమె తల్లి పాత్రలో కూడా కనిపించాల్సి వచ్చింది. అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం ప్రగతి సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును అందుకొని హీరోలకు కూడా ఆమె తల్లిపాత్రలలో కనిపించారు.

ఆ నటుడికి భార్యగా

ఆ నటుడికి భార్యగా

అయితే పాతికేళ్ల వయసులోకి రాకముందే తన వయసుతో సమానంగా ఉన్న వారితో కూడా అమ్మా అని పిలిపించుకోవడం కాస్త ఇబ్బందిగా అనిపించింది అని ప్రగతి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఇక చంద్రమోహన్ ఫ్యామిలీతో కూడా మాకు మంచి అనుభవం ఉంది. అయితే చంద్రమోహన్ భార్యను నేను ఆంటీ అని పిలిచేదాన్ని కానీ సినిమాల్లోకి వచ్చేసరికి ఆయనతో భార్యగా నటించడం జరిగింది.. అని ప్రగతి చెప్పింది.

షూటింగ్ లోనే ఏడ్చాను

షూటింగ్ లోనే ఏడ్చాను

షూటింగ్ లోనే కొన్ని సందర్భాల్లో ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా నేను తల్లిపాత్రలు చేసేందుకు షూటింగ్ కు వచ్చినప్పుడు రెండు జడలతో వస్తే మాత్రం నలుగురు సూటిపోటి మాటలతో మరింత బాధ పెట్టేవారు. తల్లి పాత్ర చేసేందుకు వచ్చిన ఈవిడెంటి ఇలా వచ్చింది అని ఎన్నో రకాలుగా అనుకునేవారు ఆ మాటలకు నేను మేకప్ రూమ్ లోకి వెళ్లి చాలాసార్లు ఏడవాల్సి వచ్చింది.. అని ప్రగతి తెలియజేసింది.

కాస్ట్యూమ్స్ నచ్చకపోతే

కాస్ట్యూమ్స్ నచ్చకపోతే

కొన్ని సందర్భాల్లో నాకు ఏమైనా కాస్ట్యూమ్స్ నచ్చకపోతే వెంటనే దర్శకుడికి చెబుతాను. అయితే మొదట హీరోయిన్ గా చేసినప్పుడు ఒక వాన సాంగ్లో ఒక కాస్ట్యూమ్ ఇబ్బందిగా అనిపించడంతో వెంటనే దర్శకుడికి చెప్పాను. అలాంటి బట్టలు ఎంత మాత్రం వేసుకోనని కూడా అక్కడే చెప్పేశాను. ఇక ఆ తర్వాత హీరోయిన్ గా ఆ ఫీల్డ్ లో నచ్చకపోవడంతో పూర్తిగా సీరియల్స్ లోకి వచ్చేసాను. ఇక ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా బిజీ అయినట్లుగా ప్రగతి తెలియజేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X