Pragathi: తప్పని పరిస్థితుల్లో డబ్బుకోసం అలాంటి పనులు చేశా.. ఆ హీరోతో గొడవ: నటి ప్రగతి

తెలుగు చిత్ర పరిశ్రమలో కేవలం హీరోయిన్స్ మాత్రమే కాకుండా కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇటీవల కాలంలో మంచి క్రేజ్ అయితే అందుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా వారి గ్లామర్ తో కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఇక వర్కౌట్స్ తో నిత్యం సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ కనిపించే వారిలో ప్రగతి ఒకరు. ఆమె ఎక్కువగా తల్లి పాత్రలలో కనిపించినప్పటికీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ బ్యూటీలకు ఏమాత్రం తక్కువ కాకుండా దర్శనమిస్తున్నారు. అయితే ఆమె తన పర్సనల్ లైఫ్ లో గతంలో చాలా చేదు అనుభవాలను చూసినట్లుగా తెలియజేశారు. చేయకూడని పరిస్థితుల్లో కొన్ని డబ్బు కోసం చేసినట్లుగా కూడా ఆమె వివరణ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే...

కొన్ని కారణాల వలన : నటి ప్రగతి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా ఎళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొదట్లో ఆమె మోడల్ గా కూడా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత హీరోయిన్ గా కూడా అవకాశాలు అందుకోవాలని అనుకుంది. కానీ కొన్ని కారణాల వలన ఆమె అటువైపుగా సక్సెస్ కాలేకపోయింది. వెండితెరపై మంచి నటిగా గుర్తింపును తెచ్చుకోవాలి అని క్యారెక్టర్ ఆర్టిస్టుగా మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించి మంచి గుర్తింపు అయితే అందుకుంది.

 pragathi

పెళ్లికి ముందే కొన్ని కష్టాలు : ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగతి తన జీవితంలోని కొన్ని కష్టాల గురించి కూడా తెలియ చేసింది. ప్రగతి మాట్లాడుతూ పెళ్లికి ముందే కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది అని ఖాళీగా ఉంటున్నాను అని ఇంట్లో కూర్చుని తినడం మా తల్లిదండ్రులకు ఏమాత్రం నచ్చలేదు. ఇక ఏదో ఒక జాబ్ చేసుకోవాలి అనే ఆలోచన కలిగింది.

 pragathi

డబ్బు కోసం అలా చేశాను : కొన్ని సందర్భాల్లో అయితే పిజ్జా షాపుల్లో కూడా పార్ట్ టైం జాబ్ చేయాల్సిన వచ్చింది. అంతేకాకుండా డబ్బు కోసం ఎస్.టి.డి బూత్ లలో కూడా పనిచేశాను. ఆ టైంలో నేను చాలా లావుగా కూడా కావాల్సి వచ్చింది. అయితే కొంత అందంగా మారిన తర్వాత మాత్రం యాడ్స్ షూట్స్ లలో పాల్గొనమని ఆఫర్స్ కూడా వచ్చాయి. ఇక ఆ రూట్లోకి వెళ్లిన నేను మెల్లగా మోడలింగ్ లోకి వెళ్లాలని అనుకున్నాను.

 pragathi
ప్రముఖ హీరోతో ఒక విషయంలో గొడవ : అక్కడ కొంతకాలం పాటు కొనసాగిన తర్వాత సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. అయితే మొదట్లో వచ్చిన అవకాశాలను నేను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాను. ఇక సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక ప్రముఖ హీరోతో ఒక విషయంలో గొడవ జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి పూర్తిగా సినిమాలను పక్కన పెట్టేసాను. అనంతరం 20 ఏళ్లకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇక మరికొంత కాలం తర్వాత నా భర్తతో కొన్ని విభేదాలు వచ్చాయి. దాంతో అతనికి విడాకులు ఇచ్చి మళ్లీ సరికొత్త జీవితాన్ని మొదలు పెట్టాను. ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన కూడా నాకు కలగలేదు.. అని ప్రగతి తెలియజేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X