Pragathi: క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి కూతురి గ్లామర్ లుక్.. తల్లితో కలిసి ఇలా.. ఫొటో వైరల్

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే బయట ప్రపంచానికి పెద్దగా తెలిసేది కాదు. కానీ సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైన తర్వాత ప్రతి సినిమా సెలబ్రిటీ కూడా మంచి క్రేజ్ అందుకుంటున్నారు. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇప్పుడు వారి కంటూ ఒక స్పెషల్ ఇమేజ్ సంపాదించుకోవడం విశేషం. ఇక అలాంటి వారిలో ప్రగతి టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఆమెకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక రీసెంట్ గా ప్రగతి కూతురుకు సంబంధించిన గ్లామరస్ ఫోటోను పోస్ట్ చేస్తూ కాస్త ఎమోషనల్ గా వివరణ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట హీరోయిన్ గా..

మొదట హీరోయిన్ గా..

ఆంధ్రప్రదేశ్ ఒంగోలులో జన్మించిన నటి ప్రగతి 1994 నుంచి సినిమా పరిశ్రమలో కొనసాగుతోంది. మొదట హీరోయిన్ గా కొన్ని ప్రయత్నాలు కూడా చేసింది. ముఖ్యంగా తమిళంలో కూడా అవకాశాలు అందుకోవాలని ట్రై చేసినప్పటికీ హీరోయిన్గా అయితే పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక 1997 తర్వాత ఆమె కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ మహేష్ బాబు బాబి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.

ఎక్కువగా హీరోలకు తల్లిగా..

ఎక్కువగా హీరోలకు తల్లిగా..

సహాయనటిగా ఎంట్రీ ఇచ్చిన ప్రగతి ఆ తర్వాత ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్టుగానే మంచి క్రేజ్ అందుకుంది. ముఖ్యంగా తల్లి పాత్రలతో మెప్పించింది. ఆమెకు ఒక సమయంలో మదర్ క్యారెక్టర్ లో నటించేందుకు చాలా ఆఫర్లు వచ్చాయి. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ యువ హీరోలందరికి కూడా ఆమె తల్లి పాత్రలలో నటించింది. అలాగే కామెడీ పాత్రలతో కూడా మెప్పించింది.

టెలివిజన్ లో కూడా..

టెలివిజన్ లో కూడా..

తెలుగులో ఆమె దాదాపు 100కు పైగా సినిమాలలో నటించింది. అలాగే తమిళంలో కూడా మరో 20 సినిమాలు చేసిన ప్రగతి మలయాళంలో కూడా రెండు సినిమాలు చేసింది. కేవలం సినిమాలలోనే కాకుండా బుల్లితెరపై కూడా ఆకట్టుకున్న ప్రగతి పలు టెలివిజన్ సీరియల్స్ లలో కూడా మంచి పాత్రలతో మెప్పించింది. తమిళంలో కూడా ఆమెకు టెలివిజన్ నుంచి మంచి అవకాశాలు వచ్చాయి.

గ్లామరస్ ఫొటోస్

గ్లామరస్ ఫొటోస్

ఎక్కువగా సినిమాలలోనే కనిపించే ప్రగతి గత రెండు మూడేళ్ల కాలంలో మాత్రం సోషల్ మీడియా ద్వారా కూడా మంచి గుర్తింపునందుకుంది. ముఖ్యంగా కరోనా తర్వాత ఆమె ఫిట్నెస్ వర్కౌట్స్ తోనే నెటిజన్స్ ఎంతగానో ఆశ్చర్యపరుస్తూ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను కూడా పెంచుకుంది. తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలను కూడా ఆమె రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటుంది.

కూతురి ఫొటో వైరల్

కూతురి ఫొటో వైరల్

ఇక రీసెంట్ గా నటి ప్రగతి తన కూతురికు సంబంధించిన ఫొటో కూడా పోస్ట్ చేసింది. ఇద్దరు కూడా బ్లాక్ డ్రెస్ లో గ్లామర్ ట్రీట్ తో ఎంతగానో ఆకట్టుకున్నారు. విదేశాల్లో చదువుకుంటున్న ప్రగతి కూతురు అప్పుడప్పుడు తల్లితో కలిసి ఈ తరహాలో కనిపిస్తూ ఉంటారు. డాటర్స్ డే సందర్భంగా తన కూతురి గురించి గొప్పగా చెప్పిన ప్రగతి కాస్త ఎమోషనల్ గా ఫీల్ అయినట్లు తెలుస్తోంది. ఆమెకు తన కంటే చాలా ధైర్యం ఎక్కువ అని గ్రేట్ డాటర్ అంటూ వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X