తెలుగు సినీ రంగానికి వరుస విషాదాలు
తెలుగు సినిమా రంగాన్ని వరుసగా విషాద సంఘటనలు వెంటాడుతున్నాయి. నిన్నగాక మొన్న లక్ష్మి సినిమాను ప్రదర్శిస్తున్న ఓడియన్ థియేటర్‌లో బాంబు పేలింది. ఆ బాంబు ఎక్కడిదన్న విషయంలో పోలీసులు ఇంకా ఒక నిర్ధారణకు రాలేకపోయారు. అంతకు ముందు సైనికుడు సినిమాకు అసిస్టెంట్ కెమెరామన్‌గా పనిచేస్తున్న వ్యక్తి యాక్సిడెంట్‌లో మరణించాడు. అంతకు కొన్ని రోజుల ముందు ప్రముఖ దర్శకుడు రాజమౌళి మీద షూటింగ్ స్పాట్‌లోనే దాడి జరిగింది. ఇటీవల తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఇలియానా చెన్నైలో జాదూ సినిమా షూటింగ్‌లో తీవ్రంగా గాయపడింది. ఆమె పాదాల్లో గాజు ముక్కలు గుచ్చుకోవడంతో వైద్యులు ఐదు కుట్లు వేయవలసి వ చ్చింది. అయితే ఆమెకు తగిలిన గాయాలు అంత తీవ్రమైనవి కావని, ఆమె ప్రస్తుతం మున్నా షూటింగ్ కోసం విశాఖపట్నంలో ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications