Tollywood Live updates: తిరుపతిలో సాయిపల్లవి, తండేల్ టీమ్.. ప్రభాస్‌తో బాలీవుడ్ హీరో

తెలుగు సినిమా పరిశ్రమలో పాన్ ఇండియా స్థాయిలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పలువురు ఇతర భాషలకు చెందిన సినీ ప్రముఖులు టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా పరిశ్రమలో ముఖ్యంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ పరిశ్రమలో జరుగతున్న సంఘటనలు, లేటేస్ట్ అప్ డేట్స్ మీ కోసం..

Telugu Cinema February 13th updates

LIVE Feed
  • Feb 13, 2025 3:24 PM

    ఎన్టీఆర్‌తో అనుపమ్ ఖేర్

    యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సమావేశమయ్యారు. నా ఫేవరేట్ పర్సన్, యాక్టర్‌ను కలువడం చాలా హ్యాపీగా ఉంది. గత రాత్రి ఆయనను కలిశాను. ఆయన సినిమాలంటే నాకు ఇష్టమని చెప్పాను. ఆయన మరింత శక్తితో ఎదుగాలని ఆశిస్తున్నాను అని అనుపమ్ ఖేర్ అన్నారు.

  • Feb 13, 2025 2:57 PM

    నంబర్ 1 ట్రెండింగ్‌గా విజయ్ దేవరకొండ కింగ్‌డమ్

    విజయ్ దేవరకొండ నటించిన కింగ్‌డమ్ సినిమా టీజర్‌కు అనూహ్యమైన రెస్సాన్స్ వస్తున్నది. ఈ సినిమా సోషల్ మీడియాలో నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతున్నది.

    నంబర్ 1 ట్రెండింగ్‌గా విజయ్ దేవరకొండ కింగ్‌డమ్
  • Feb 13, 2025 2:51 PM

    టికెట్ కొనుకొంటున్న నాగార్జున

    కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ రూపొందించిన తల సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి అక్కినేని నాగార్జున తన వంతు ప్రయత్నంగా ఈ సినిమా టికెట్‌ను బుక్ మై షో ద్వారా కొనుగోలు చేస్తారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

  • Feb 13, 2025 2:48 PM

    ప్రభాస్‌తో అనుపమ్ ఖేర్

    ఇండియన్ సినిమా బాహుబలి ప్రభాస్‌తో కలిసి నా 544వ సినిమాలో నటిస్తున్నాననే విషయం చెప్పడానికి ఆనందంగా ఉంది. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు అని అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు.

  • Feb 13, 2025 2:45 PM

    తిరుమలలో సాయిపల్లవి, నాగచైతన్య

    కలియుగ పుణ్యక్షేత్రం తిరుమలలో తండేల్ సినిమా యూనిట్ సందడి చేసింది. చిత్ర యూనిట్ సభ్యులందరూ శ్రీ బాలాజీ సేవలో తరించారు. శ్రీ వెంకటేశ్వరస్వామికి సాయిపల్లవి, నాగచైతన్య, బన్నీ వాసు, అల్లు అరవింద్, చందూ మొండేటి తదితరులు ప్రత్యేక పూజలు జరిపి స్వామి వారి ఆశీస్సులు అందుకొన్నారు.

More from Filmibeat

Read more about: tollywood sai pallavi prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X