Tollywood 2024 Review: ఫస్టాఫ్ హిట్టా? ఫట్టా? స్టార్ హీరోలు బోల్తా.. చిన్న సినిమాల హవా¡

తెలుగు సినిమా రంగంలో 2024 సంవత్సరంలో సగం ముగిసిపోయింది. ఈ సంవత్సరంలో ఎప్పటిలానే సక్సెస్ శాతం చాలా తక్కువగా ఉండటం గమనార్హం. ఈ ఏడాది ప్రథమార్థంలో ఎక్కువ శాతం చిన్న సినిమాలు భారీగా రిలీజ్ అయ్యాయి. అయితే ఈ సంవత్సరంలో భారీగా అంచనాలతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగానే బోల్తా పడ్డాయి. ప్రస్తుతం సంవత్సరంలో ఎన్ని హిట్లు.. ఎన్ని ఫట్స్ అనే వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం సంవత్సరం సినిమా పరిశ్రమకు మిశ్రమంగా స్పందన లభించింది. ఈ ఏడాది ప్రథమార్థంలో ఐపీఎల్, పార్లమెంట్ ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో భారీ సినిమాలు వెనక్కి వెళ్లిపోయాయి. ఇక టీ20 వరల్డ్ కప్ లాంటివి కూడా సినిమాలకు అడ్డుపడ్డాయి. దాంతో స్టార్ హీరోల సినిమాలు పెద్దగా ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాయి.

Telugu Cinema Industry First half year Review Here is the Hits and Flop list

2024 సంవత్సరంలో ప్రథమార్థం అంటే గడచిన 6 నెలల్లో సుమారు 160 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ ఏడాది పెద్ద హీరోలు రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, చిరంజీవి లాంటి అగ్రహీరోల సినిమాలు రాకపోవడంతో పెద్దగా ఆసక్తి కనపడలేదు. వెంకటేష్, గోపిచంద్ లాంటి హీరోల సినిమాలు నిరాశ పరిచాయి.

ఈ సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సినిమాల్లో సైంధవ్, ఆపరేషన్ వాలంటైన్, ఫ్యామిలీ స్టార్, గీతాంజలి మళ్లీ వచ్చింది, ఆ ఒక్కటి అడక్కు, బూట్ కట్ బాలరాజు, భీమా, రజాకార్, రత్నం, అరణ్మనై 4, శబరి, కృష్ణమ్మ, రాజు యాదవ్, మనమే, సత్యభామ, లవ్ మౌళి, రక్షణ, హరోమ్ హర, నింద లాంటి సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.

ఇక ఈ ఏడాది హిట్ రేసులో నిలిచిన చిత్రాల్లో హనుమాన్, గుంటురు కారం, నా సామిరంగా, అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్, ఊరు పేరు భైరవకోన, గామి, ఓం భీమ్ బుష్, టిల్లు స్క్వేర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కల్కి 2898, ఈగిల్ చిత్రాలు ఉన్నాయి.

Telugu Cinema Industry First half year Review Here is the Hits and Flop list

ఇక డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే.. ఆడు జీవితం, భ్రమయుగం, ప్రేమలు, మంజుమ్మేల్ బాయ్స్ విజయం సాధిస్తే.. లాల్ సలామ్, కెప్టెన్ మిల్లర్ చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి.

ఇక తెలుగు ఇండస్ట్రీలో సంచలనం, వివాదాలు రేపిన పొలిటికల్ డ్రామాలు కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాస్ అయ్యాయి. అందులో యాత్ర 2, వ్యూహం, ప్రతినిధి 2, రాజధాని ఫైల్స్ లాంటి సినిమాల్లో ఏ ఒక్కటి కూడా కనీస స్థాయిలో కూడా మెప్పించలేకపోయాయి.

చిన్న చిత్రాల్లో సుందరం మాస్టర్, మస్తు షేడ్స్ ఉన్నాయి, భూతద్దం భాస్కర్ నారాయణ, షరతులు వర్తిస్తాయి, తంత్ర, టెనెంట్, ప్రసన్న వదనం, సత్య, మ్యూజిక్ షాప్ మూ్తి, ప్రభుత్వ జూనియర్ కళాశాల లాంటి సినిమాలు ఫర్వాలేదనే టాక్ వినిపించినా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి.

More from Filmibeat

Read more about: tollywood hanuman kalki 2898 ad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X