»   » తెలుగు సినీ స్టార్స్- చిత్రమైన సెంటిమెంట్స్ ( ఫోటో ఫీచర్)

తెలుగు సినీ స్టార్స్- చిత్రమైన సెంటిమెంట్స్ ( ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినిమాల్లోనే కాదు సినిమా వాళ్ల జీవితాల్లోనూ సెంటిమెంట్స్ కో కొల్లలు. కోట్లతో వ్యాపారం కాబట్టి సెంటిమెంట్స్ ని నమ్ముతున్నామంటారు. ఒక్కొక్కరకి ఒక్కో సెంటిమెంట్ ...కొందరకు భగవంతుడు సెంటిమెంట్ అయితే మరికొందరకి థియోటర్స్ సెంటిమెంట్...హిట్ సినిమా లొకేషన్ సెంటిమెంట్..లక్కీ హీరోయిన్ సెంటిమెంట్ ఇలా కుప్పలు తెప్పలుగా సెంటిమెంట్స్.

అంతెందుకు సినిమా మొదలుపెట్టడప్పుడు పెద్ద పూజతో చేస్తారు. షూటింగ్ ప్రతీ రోజు .. కెమెరా కు కొబ్బరికాయ కొట్టడం ఓ సెంటిమెంట్. సినిమా షూటింగ్ పూర్తవగానే గుమ్మడికాయ కొడతారు. ఇవి నమ్మకం ఉండటం...నమ్మకం లేకపోవటంతో సంభంధం లేకుండా ఇవి ఆచరిస్తూంటారు. అలాగే కొంతమంది హీరోలకు తాము గతంలో హిట్ కొట్టిన లొకేషన్ లో ఒక్క షాట్ అయినా పెట్టి తీరాలనే నమ్మకం ఉంటుంది.

అలాగే... ఆడియో పంక్షన్ కు వేసుకొచ్చే డ్రస్ కలర్ సెంటిమెంట్ కూడా కొందరుకి ఉంది. అలాగే కొందరికి తమ సినిమా టైటిల్స్ ఫలానా అక్షరంతో మొదలైతే హిట్ కొడతామననే నమ్మకం ఉంటుంది. అంతేగాక ఇప్పుడు ఫలానా హీరో పాట కానీ టైటిల్ ని వాడుకోవటం ఓ సెంటిమెంట్ గా మారింది.

ఇలా తెలుగులో ఉన్న కొందరి సెంటిమెంట్స్ సరదాగా స్లైడ్ షో లో...

మహేష్ బాబు

మహేష్ బాబు

గత మూడేళ్లుగా మహేష్ బాబు తన సినిమా విడుదల కు ముందు అజ్మల్ దర్గా కు వెళ్లి వస్తున్నాడు. అక్కడకి వెళ్ళటం సెంటిమెంట్ గా మారింది. మొదటి సారి అక్కడికి వెళ్లివచ్చినప్పుడు అతనికి దూకుడు తో ఘన విజయం లభించటంతో దాన్ని ఫాలో చేస్తున్నాడు. ఇప్పుడు తాను చేస్తున్న 1 నేనొక్కడినే చిత్రానికి కూడా రిలీజ్ కు ముందు అక్కడికి వెళ్లి వస్తాడంటున్నారు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి వైజాగ్ సెంటిమెంట్ ఉంది. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ చెప్పారు. ఆయన చిత్రాలు బన్ని, జులాయి, ఆర్య కు ఒక్క షాట్ అయినా వైజాగ్ లో తీయాలనుకున్నాం..సక్సెస్ సాధించాం అన్నారు. అయితే ఇద్దరమ్మాయిలతో చిత్రం వైజాగ్ లో షూట్ చేయలేదు. ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు.

రామ్ చరణ్

రామ్ చరణ్

మగధీర సినిమాలో వర్కవుట్ అయిన సెంటిమెంట్ ని రచ్చలో కూడా ఫాలో అయిన రామ్ చరణ్ అదే సెంటిమెంట్ ని తన రాబోయే సినిమాలో కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఇంతకు ఆ సెంటిమెంట్ ఏమిటి అనుకుంటున్నారా? చిరంజీవి హిట్ పాటలని రీమిక్స్ చేసి తన సినిమాలో వాడుకోవడం. కొండవీటి దొంగ సినిమాలోని శుభ లేఖ రాసుకున్న పాటని వివి వినాయక్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలో రీమిక్స్ చేసి వాడారు. గతంలో మగధీర సినిమాలో బంగారు కోడిపెట్ట, రచ్చ సినిమాలో వాన వాన వెల్లువాయే పాటలు రీమిక్స్ చేయగా రెండు సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. జంజీర్ లో ఏ పాటను రీమిక్స్ చేయలేదు..ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.

సిద్దార్ధ్

సిద్దార్ధ్

హీరో సిద్దార్ద కు హైదరాబాద్ శాంతి థియోటర్ అంటే సెంటిమెంట్ అంటారు. ఆ ధియోటర్ లో అతని సినిమాలు బాగా ఆడాయి. దాంతో అతని సినిమాలు రిలీజ్ అక్కడ తప్పకుండా షో పడేటట్లు చూసుకుంటాడు.

కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్

కాజల్ కి డ్రస్ కలర్స్ సెంటిమెంట్. వైట్ కలర్ వేసుకుని ఆమెపై ఇంట్రడక్షన్ సీన్ తీస్తే ఆ సినిమా హిట్ అంటారు. ఈ సెంటిమెంట్ మగధీర నుంచి మొదలైంది. అందులో ఇందు పాత్రకు ఆమె ఇంట్రడక్షన్ వైట్ కలర్ అవుట్ ఫిట్ తో చేసారు. అక్కడ నుంచి మిగతా నిర్మాతలు అదే ఫాలో అవుతున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ

అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారికి సంక్రాంతి పండగ సెంటిమెంట్ ఉండేది. ఆయన చాలా చిత్రాలు ముఖ్యంగా పాడి పంటలు, బంగారు భూమి, ఇల్లు ఇల్లాలు, కొత్త కాపురం, కొల్లేటి కాపురం వగైరా చిత్రాలు సంక్రాంతికి విడుదలై మంచి రెవిన్యూ సాధించాయి.

దర్శకుడు సుకుమార్

దర్శకుడు సుకుమార్

యూత్ లో మంచి పేరు ఉన్న దర్శకుడు సుకుమార్ కి ఐటం సాంగ్ ల సెంటిమెంట్. ఆయన చిత్రాల్లో ఖచ్చితంగా ఐటం సాంగ్ ఉంటుంది. అది పెద్ద హిట్ అవుతుంది. తాజాగా మహేష్ తో చేస్తున్న 1 నేనొక్కడినే కోసం సోఫియా చౌదరి చేత లండన్ లో ఐటం సాంగ్ ని తీసారు. అది పెద్ద హిట్ అవుతుందంటున్నారు.

రామానాయుడు

రామానాయుడు

నిర్మాత రామానాయుడుకు తిరుపతి వెళ్లటం సెంటిమెంట్. ఆయన సినిమా మొదట కాపీ పట్టుకుని తిరుపతి వెళ్లి వస్తూంటారు. అలాగే రీసెంట్ గా ఆయన నేనేం చిన్న పిల్లనా సినిమా కూడా వెంకన్న సన్నిథికి తీసుకు వెళ్ళారు. ఆయన తన 130 సినిమాలు 50 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ లో ఎప్పుడూ ఈ ఆచారం మరువలేదని, అదే తన సక్సెస్ మంత్ర అని చెప్తారు.

కె.రాఘవేంద్రరావు

కె.రాఘవేంద్రరావు

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారికి కూడా తిరుపతి సెంటిమెంట్. ఆయన సినిమా షూటింగ్ మొదట్లో గెడ్డం పెంచి షూటింగ్ పూర్తయ్యాక తిరుపతి వెళ్లి మ్రొక్కు తీర్చుకుంటూంటారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ...ఇది చాలా ఓల్డ్ సెంటిమెంట్. నా రెండవ సినిమా నుంచి ఫాలో అవుతున్నాను. నా గెడ్డం, మీసాలు అన్నీ సినిమా రిలీజ్ కు ముందు వెంకన్న కి సమర్పిస్తాను అంటారు

కె. విశ్వనాథ్

కె. విశ్వనాథ్

ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ కు ఖాఖీ బట్టల సెంటిమెంట్ ఉంది. ఆయన షూటింగ్ మొదలు పెట్టిన నాటి నుంచి అదే డ్రస్ లో షూటింగ్ అయ్యేదాకా ఉంటారు. అలాగే ఆయన తన సినిమాల్లో నటించటం తమ సెంటిమెంట్ అంటారు దశరథ్.

పూరి జగన్నాథ్

పూరి జగన్నాథ్

ఈ కాలం దర్శకుడు పూరి జగన్నాథ్ కు బ్యాంకాక్ సెంటిమెంట్. ఆయన తన సినిమా స్క్రిప్టులు అన్నీ అక్కడి కి వెళ్లే రాస్తూంటారు. అక్కడ రాసిన స్క్రిప్టులన్నీ సూపర్ హిట్టయ్యాయని చెప్తూంటారు. అలాగే షూటింగ్ లకు కూడా ఎక్కువగా పూరీ..బ్యాంకాక్ కే వెళ్తూంటారు.

వంశీ

వంశీ

ప్రముఖ దర్శకుడు వంశీ కు గోదావరి అంటే సెంటిమెంట్. ఆయన కథలు ఎక్కువగా గోదావరి చుట్టూ తిరిగేవే ఎంచుకుంటారు. లేదా పాటలైనా అక్కడ చిత్రీకరిస్తూంటారు. గోదారవి ఆయన సినిమాల్లో ప్రవహిస్తూంటుంది.

థియోటర్ సెంటిమెంట్

థియోటర్ సెంటిమెంట్

మహేష్ బాబుకు సుదర్శన్ థియోటర్ అంటే సెంటిమెంట్. ఆయన చిత్రాలు ఒక్కడు, మురారి, పోకిరి, అతడు, దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అన్నీ ఆ థియోటర్లో వంద రోజులు ఆడాయి.

 సమంత

సమంత

స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హీరోలకు సెంటిమెంట్ గా మారింది. నాగచైతన్య కు ఆమె ఏం మాయ చేసావే తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్టైంది. దాంతో ఆమెను ఆటోనగర్ సూర్య, మనం సినిమాల్లో తన సరసన తీసుకున్నాడు నాగచైతన్య. తర్వాత ఆమె మహేష్ తో దూకుడు,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చేసింది. ఆ రెండు హిట్. నానితో ఈగ చిత్రం చేస్తే అది హిట్. పవన్ తో అత్తారింటికి దారేది చేస్తే అది సూపర్ హిట్. దాంతో హీరోలంతా ఆమెను తమ ప్రక్కన తీసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

నితిన్

నితిన్

పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని కావడం యంగ్ హీరో నితిన్‌కు బాగానే కలిసొస్తుంది. నితిన్ నటించిన గత సినిమా ‘గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రం ఆడియో పవర్ స్టార్ చేతుల మీదుగా విడుదలకావడం, ఆ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్‌ను నితిన్ ఇమిటేట్ చేయడం సినిమాకు ప్లస్సయింది. నితిన్ తాజా సినిమా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్' చిత్రంలోనూ పవన్ కళ్యాణ్ సెంటిమెంటు రిపీట్ చేయబోతున్నాడు నితిన్. ఈ సినిమాలో నితిన్ క్యారెక్టర్ పేరు పి.కె (పనిలేని కళ్యాణ్). పవన్ కళ్యాణ్‌ను కూడా ఇండస్ట్రీలో అంతా షార్ట్‌కట్‌లో పి.కె అని పిలుస్తుంటారు. అయితే ఇది యాధృచ్చికంగా జరిగినది మాత్రమే అంటున్నాడు నితిన్.

English summary
For the last three years, Mahesh Babu has been visiting Ajmer Dargah before his films' release, following the record-breaking success of Dookudu, after his maiden visit. His dad Superstar Krishna had a lucky connection with Sankrathi festival.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu