సినీ ప్రేమికులకు...బ్యాడ్ న్యూస్

ఇటీవల జరిగిన నంది అవార్డుల సభలో టికెట్ల ధరను రూ.50కు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించిన నేపధ్యంలో గురువారం జారీ అయిన ఉత్తర్వులపై సినీ నిర్మాతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్ .నారాయణమూర్తి లాంటి చిన్నచిత్రాల నిర్మాతలు మాత్రం టికెట్ల ధరల పెంపును తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. టికెట్ల ధరలను పెంచడం వలన తాము తీవ్రంగా నష్టపోతున్నట్టు చిన్న నిర్మాతలు ఆందోళన వ్యక్తం చే సినప్పటికీప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎయిర్ కండీషన్డ్ థియేటర్‌లో అప్పర్ క్లాస్ టికెట్ ధర రూ.40 ఉంది, ఎయిర్ కూల్డ్ థియేటర్లలో ఈ ధర రూ.35 మాత్రమే. తాజా మార్పుల అనంతరం రెండు రకాల ఏసీ థియేటర్లలో ఇకపై అప్పర్ క్లాస్ టికెట్ ధర రూ.50 ఉంటుంది.


Click it and Unblock the Notifications











