డ్రంక్ అండ్ డైవ్.... మీడియాను చూసి కారుకింద దూరిన తెలుగు కమెడియన్!
తెలుగు కమెడియన్ నవీన్ శనివారం రాత్రి మీడియాను చూసిన పారిపోయిన సంఘటన తెలుగు మీడియాలో హాట్ టాపిక్ అయింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ మీడియా కంట పడకుండా నానా పాట్లు పడ్డారు.

కారుకింద నక్కిన నవీన్
మీడియా నవీన్ వైపు కెమెరాలు తిప్పడంతో కారుకింద దూరిపోయాడు. కారు కింద కూడా మీడియా కెమెరాలు పెట్టడంతో నవీన్ పరుగులు పెట్టారు.

తెలుగు మీడియాలో వైరల్
ఈ సంఘటన మీడియాలో వైరల్ అయింది. నవీన్ డైరెక్టుగా మీడియా ముందు నిలుచున్నా ఇంత సీన్ ఉండేది కాదేమో, కానీ ఇలా ప్రవర్తించడంతో మరింత హైలెట్ అయ్యాడు.

కేసు నమోదు, కార్ సీజ్
డ్రంక్ అండ్ డ్రైవ్ సంఘటనకు సంబంధించి నవీన్ మీద కేసు నమోదు చేసి, కారు సీజన్ చేసినట్లు సమాచారం.

తెలుగు సినిమాల్లో బిజీ
ప్రస్తుతం నవీన్ తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ‘ఆక్సిజన్' మూవీ ఇటీవల విడుదలైంది. ఇందులో హీరో తమ్ముడి ఫ్రెండ్ పాత్రలో నవీన్ నటించారు.


Click it and Unblock the Notifications











