For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'డార్క్ సీక్రెట్స్'?: లొంగిపోయిన విజయ్‌సాయి భార్య, అవి బయటపడితే సంచలనమే..

  |
  పోలీసులకు లొంగిపోయిన.. విజయ్‌సాయి భార్య !

  హాస్యనటుడు విజయ్‌సాయి మరణం సినీ పరిశ్రమలో చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆత్మహత్య తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు విజయ్ మృతికి గల కారణాలపై సస్పెన్స్ పెంచాయి.
  ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో భార్య వనితా రెడ్డిపై విజయ్ ఆరోపణలు చేయడం.. ఆ తర్వాత ఆమె కూడా ధీటుగా ప్రత్యారోపణలు చేయడం.. మొత్తంగా అసలు తప్పెవరిది? అన్న విషయం మాత్రం తేలలేదు.

  విజయ్ ఆత్మహత్య తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వనితారెడ్డి తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఈ నేపథ్యంలో కేసులో చిక్కుముడి ఇప్పటికైనా వీడుతుందా? అన్న ఆసక్తి నెలకొంది.

   విజయ్ సెల్ఫీ వీడియో:

  విజయ్ సెల్ఫీ వీడియో:

  తన భార్య, మరో ఇద్దరు కలిసి తనను వేధించారని.. అందువల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని విజయ్ సాయి సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. పెళ్లికి ముందు నుంచే తన భార్యకు అక్రమ సంబంధాలు ఉన్నాయని, కొంతమంది పారిశ్రామికవేత్తలు ఆమెను లైంగికంగా వాడుకున్నారని సంచలన ఆరోపణలు చేశాడు. ఆమె ఊరికి వెళ్లి కనుక్కుంటే వనితారెడ్డి గురించి, ఆమె తల్లి గురించి దిగ్భ్రాంతికర విషయాలు తెలిశాయన్నాడు.

   వనితారెడ్డి ప్రత్యారోపణలు:

  వనితారెడ్డి ప్రత్యారోపణలు:

  విజయ్ తనపై చేసిన ఆరోపణలకు వనితా రెడ్డి కూడా ధీటుగా కౌంటర్ ఇచ్చారు. విజయ్ కే అమ్మాయిల పిచ్చి ఉందని, అతనికి హెచ్ఐవి కూడా సోకిందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయం విజయ్ తో సంబంధం పెట్టుకున్న అమ్మాయే చెప్పిందని తెలిపారు. తనముందే అమ్మాయిలను బెడ్రూమ్ లోకి తీసుకెళ్లేవాడని చెప్పుకొచ్చారు.

   అజ్ఞాతం నుంచే:

  అజ్ఞాతం నుంచే:

  విజయ్ సాయి ఆత్మహత్య తర్వాత అతని అంత్యక్రియలకు కూడా ఆమె హాజరుకాలేదు. ఆఖరికి విజయ్ సాయి ప్రాణానికి ప్రాణంగా చూసుకునే తన బిడ్డను కూడా వనితా రెడ్డి అంత్యక్రియలకు పంపించలేదు. అప్పటినుంచి అజ్ఞాతంలోనే ఉన్న వనితా రెడ్డి.. విజయ్ అక్రమ సంబంధాలకు సంబంధించిన కొన్ని ఫోటోలను బయటపెట్టింది.

   ఎక్కడివీ ఫోటోలు:

  ఎక్కడివీ ఫోటోలు:

  వనితారెడ్డి బయటపెట్టిన ఫోటోలు ఆమెకు ఎక్కడినుంచి వచ్చాయన్నది అంతుచిక్కడం లేదు. ఫోటోల్ని గమనిస్తుంటే మాత్రం.. విజయ్ వేరే అమ్మాయితో శృంగారంలో ఉండగా.. మూడో వ్యక్తి వాటిని తీసినట్లుగా తెలుస్తోంది.

  అలా అయితే.. ఆ మూడో వ్యక్తి ఎవరు? అన్నది కూడా అర్థం కావడం లేదు. వనితా రెడ్డి వాదన మాత్రం మరోలా ఉంది. విజయ్‌ను చెడ్డగా చిత్రీకరించేందుకు తాను ఫోటోలు లీక్ చేయలేదని, తనపై చేసిన ఆరోపణలు నిజం కాదని చెప్పడానికే వాటిని బయటపెట్టాల్సి వచ్చిందంటున్నారు.

  ఎవరిది నిజం?:

  ఎవరిది నిజం?:

  విజయ్, వనితారెడ్డి.. ఇద్దరు ఒకరిపై ఒకరు అక్రమ సంబంధాల ఆరోపణలు చేసుకున్నారు. విజయ్ కి అమ్మాయిల పిచ్చి ఉందని తెలిశాక తమ మధ్య గొడవలు జరిగాయని. ఈ క్రమంలో తనపై చేయి కూడా చేసుకున్నాడని వనితారెడ్డి చెప్పారు. ఈ క్రమంలోనే కోర్టుకు కూడా వెళ్లి విడాకులకు దరఖాస్తు చేసినట్లు తెలిపారు.

   విజయ్ సాయి తల్లిదండ్రుల ఆరోపణలు:

  విజయ్ సాయి తల్లిదండ్రుల ఆరోపణలు:

  తమ కొడుకుపై అన్యాయంగా లేనిపోని ఆరోపణలు చేస్తోందని విజయ్ సాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విజయ్ నుంచి భారీగా డబ్బు డిమాండ్ చేసిందని, ఈ క్రమంలోనే కారును కూడా లాక్కెళ్లిందని అంటున్నారు. మరోవైపు వనితా రెడ్డి మాత్రం ఆ కారు తనదేనని, పెళ్లి సమయంలో ఇచ్చిన డబ్బును మాత్రమే తాను డిమాండ్ చేశానని అంటున్నారు.

  డార్క్ సీక్రెట్స్?:

  డార్క్ సీక్రెట్స్?:

  అజ్ఞాతంలోకి వెళ్లిన వనితా రెడ్డి ఇన్నాళ్లు ఎక్కడ తలదాచుకున్నారన్నది కూడా కీలకంగా మారనుంది. వనితా రెడ్డి మాత్రం విజయ్ సాయి అక్రమ సంబంధాల వివరాలు సేకరించే పనిలోనే తాను అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. ఆధారాలతోనే తాను వచ్చానని ఆమె చెబుతున్న తీరు చూస్తుంటే.. విజయ్ సాయి జీవితంలో 'డార్క్ సీక్రెట్స్' ఉన్నాయా? అన్న అనుమానం కూడా కలుగుతోంది.

   ఏం తేలుతుందో?:

  ఏం తేలుతుందో?:

  వనితా రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయిన నేపథ్యంలో.. విచారణలో ఆమె నుంచి కీలక విషయాలు రాబట్టే అవకాశం ఉంది. విజయ్ సాయి ఆత్మహత్యలోని అసలు కోణాలు బయటపడితే.. అవి సంచలనంగా మారుతాయనే ప్రచారం కూడా ఉంది. సో.. అసలు మిస్టరీ వీడేందుకు మరికొద్ది రోజులు ఓపిక పట్టక తప్పదు.

  English summary
  Telugu comedian Vijay Sai’s wife Vanitha has surrendered infront Jubilee hills police on Wednesday.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X