ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఎన్‌బికె సేవా సంస్థ: బాలకృష్ణ

By Bojja Kumar

హైదరాబాద్: బాలయ్య బాబు వచ్చాడు...పదండ్రోయ్! అంటూ కృష్ణ జిల్లాలోని పలువురు నందమూరి అభిమానులు శనివారం ఉదయమే నిమ్మకూరు దారి పట్టారు. చాలా రోజుల తర్వాత బాలకృష్ణ తన తండ్రి ఎన్టీరామారావు పుట్టిన నిమ్మకూరుకు చేరుకున్నారు. దీంతో ఆయన్ను చూసేందుకు భారీగా అభిమానులు పరిసర ప్రాంతాల నుండి తరలి వచ్చారు.

హైదరాబాద్ నుండి నేరుగా గన్నవరం ఎయిర్ పోర్టుకు శుక్రవారం సాయంత్రం చేరుకున్న బాలకృష్ణ అక్కడి నుండి రోడ్డు మార్గంలో రాత్రి నిమ్మకూరు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేసిన ఆయన, శనివారం వైకుంట ఏకాదశిని పురస్కరించుకుని నిమ్మకూరులోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బాలయ్య రాకతో ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం నిమ్మకూరులో సురక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభిచారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ....ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సేవా కార్యక్రమాలను సేవా కార్యక్రమాలను విస్తరిస్తామని తెలిపారు.

భవిష్యత్‌లో అభిమానుల ఆధ్వర్యంలో ఎన్‌బికె సేవా సంస్థను ప్రారంభించనున్నట్లు బాలకృష్ణ తెలిపారు. ఈ సంస్థకు చైర్మన్‌గా నేనే ఉంటానని చెప్పిన ఆయన....ఈ సంస్థ ద్వారా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. బాలయ్య రాక సందర్భంగా తెలుగుదేశం పార్టీలు వర్గాలు పార్టీ జెండాలు, కటౌట్లతో నిమ్మకూరును పసుపుమయం చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X