యాక్సిడెంట్ లో తెలుగు దర్శక నిర్మాత దుర్మరణం
హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం నందిగామ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దర్శకనిర్మాత సి.హెచ్.శ్రీనివాస్ (48) మృతిచెందారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఆయనకు భార్య ఉమ, ఇద్దరు కూతుళ్లున్నారు.

1966 సం॥లో నల్లగొండ జిల్లా దేవరకొండలో జన్మించిన సి.హెచ్.శ్రీనివాస్.. అలీ నటించిన సర్కస్ సత్తిపండు (1997) చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. స్వీయ దర్శకనిర్మాణంలో సమ్‌థింగ్ స్పెషల్ అనే చిత్రాన్ని రూపొందించాడు. అనంతరం బిల్డర్‌గా మారారు.
ఆయన అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్‌లో జరిగాయి. విద్యాశాఖ మంత్రి జి. జగదీశ్వర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం, దర్శకుడు ఎన్.శంకర్ అంత్యక్రియలకు హాజరై శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు.


Click it and Unblock the Notifications











