హీరో నీచ్ కమీన్ కుత్తే.. అలాంటి పనిచేస్తాడా? కేజీఎఫ్ సినిమా, డైరెక్టర్‌పై యువ దర్శకుడు నోటిదురుసు
కేరాఫ్ కంచరపాలెం సినిమా దర్శకుడు, నటుడు వెంకటేష్ మహా వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల జరిగిన ఓ డిబేట్‌లో కేజీఎఫ్ సినిమా మేకింగ్‌పై, అలాగే కేజీఎఫ్ కథ, కథనాలపై ఘాటైన విమర్శలు చేశారు. తలాతోకా లేని కథలతో సినిమాలు తీసి.. కోట్లు సంపాదిస్తున్నారు అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వెంకటేష్ మహా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తీవ్రమైన విమర్శలు చేసిన వెంకటేష్ మహా వ్యాఖ్యలపై ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఆయన చేసిన వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే...

వెంకటేష్ మహా అత్యుత్సాహం
ఇంద్రగంటి మోహన్ కృష్ణ, నందినీ రెడ్డి, శివ నిర్వాణ, వెంకటేష్ మహా ఇటీవల ఓ డిబేట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా కథలు, కథనాలు, విజయాలు తదితర అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే ఈ చర్చ సందర్భంగా వెంకటేష్ మహా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ సినిమా మేకింగ్, కేజీఎఫ్ సినిమాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆయన వ్యాఖ్యలు దక్షిణాది సినిమా పరిశ్రమలో వివాదంగా మారాయి.

కొడుకు తల్లి గొప్పవాడు కావాలని...
వెంకటేష్ మహా డిబేట్‌లో మాట్లాడుతూ... గోల్డ్ మైన్ అంటూ చితక్కొట్టారు. నేను ఆ సినిమా పేరు చెప్పను. ఓ తల్లి తన కొడుకుని నీవు ఎప్పటికైనా గొప్పవాడై అందరికి మంచి చేయాలని కోరుకొంటుంది. తల్లి కొంత బంగారం కావాలని కోరుకొంటుంది.
గోల్డ్ మైన్‌లో పనిచేసే కార్మికులను హీరో ఉద్దరిస్తాడు. చివరకు మొత్తం బంగారాన్ని తీసుకెళ్లి సముద్రంలో కలిపేస్తాడు. అలాంటి హీరో ఎంత నీచ్ కమీన్ కుత్తే గాడు కాకపోతే.. చివరకు వేల మందికి ఇందిరమ్మ పథకంలో ఇండ్లు ఇచ్చి.. బంగారం మొత్తం సముద్రం పాలు చేస్తాడు. అలాంటి నీచ్ కమిన్ కుత్తేగాడు ఎవరైనా ఉంటారా? అని ప్రశ్నించారు.

ఇదెక్కడి న్యాయం అనేలా
అర్ధం పర్ధం లేకుండా అలాంటి కథలను సినిమాలుగా తీస్తే.. మనం చప్పట్లు కొటుతున్నాం. ఇలాంటి సినిమాలు తీయడం ఇదెక్కడి న్యాయం అనేలా ప్రశ్నించాడు. కేజీఎఫ్ సినిమా కథపై ఆవేశంగా తన అక్కసును వెళ్లగక్కాడు. ఆవేశంగా యాంకర్ మాటలకు అడ్డుపడుతూ.. తన అసహనాన్ని వెళ్లగక్కాడు.

ఎందుకింత అసహనం వెంకటేష్ మహా
అయితే వెంకటేష్ మహా మాట్లాడిన మాటలపై నెటిజన్లలో ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకింత అసహనం, ఒక సినిమాపై ఆ రేంజ్‌లో విరుచుకు పడాల్సిన అవసరం ఉందా? కేజీఎఫ్ రెండు భాగాలను ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ప్రేక్షకాదరణ పొందిన సినిమాపై తన అక్కసును వెళ్లగక్కడం సరికాదు అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెకిలిగా నవ్వడంపై నెటిజన్ల ఆగ్రహం
ఓ ప్రముఖ జర్నలిస్టు నిర్వహించిన రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో నందినిరెడ్డి, ఇంద్రగంటి, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ, వెంకటేష్ మహా పాల్గొన్నారు. అయితే అక్కడ ఉన్న ప్రతీ ఒక్కరు కూడా వెంకటేష్ మాటలకు సపోర్టుగా నిలుస్తూ.. వెకిలిగా నవ్వుతూ వీడియోలో కనిపించారు. తోటి డైరెక్టర్ వర్క్‌ను ప్రశంసించకపోయినా.. అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఎంజాయ్ చేస్తూ కనిపించడంపై సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











