'నాగవల్లి' పై వివి వినాయిక్, బోయపాటి, క్రిష్, శ్రీను వైట్ల కామెంట్స్
శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మించిన 'నాగవల్లి' చిత్రం ప్రమోషన్ లో భాగంగా రామానాయుడు స్టూడియోస్ లో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సందర్భంగా...ప్రముఖ దర్శకులు..వివి వినాయిక్, క్రిష్, శ్రీను వైట్ల, బోయపాటి ఈ చిత్రం గురించి మాట్లాడారు. ముందుగా వివి వినాయక్ మాట్లాడుతూ "వెంకటేశ్ చేసిన రాజు పాత్రని బాగా ఆస్వాదించాం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని దర్శకుడు పి. వాసు తీర్చిదిద్దిన తీరు గొప్పగా ఉంది. సినిమా ఆద్యంతం గ్లామరస్ గా, రిచ్‌గా ఉంది" అన్నారు.
అనంతరం దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ "నిర్మాత బెల్లంకొండ ఓ తపనతో, ధైర్యంతో సినిమాలు తీస్తుంటారు. వెంకటేశ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ సినిమా హిట్టవడం సంతోషదాయకం" అన్నారు. 'వేదం' దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ "నెగటివ్ షేడ్స్ వున్న పాత్రల్ని పేరుపొందిన హీరోలు చేయడం అరుదు. అలాంటి ఛాయలున్న రాజు పాత్రలో వెంకటేశ్ నటన ఔరా అనిపించింది" అన్నారు. 'సింహా' డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ ..ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకునే హీరో వెంకటేశ్. రాజు పాత్రని ఆయన పోషించిన తీరు అమోఘం. ఎప్పుడూ కొత్తదనం కోరుకొనే కథానాయకుడు వెంకటేష్. ఆయన 'నాగవల్లి'లో ఆ ప్రయత్నం చేసి సఫలమయ్యారన్నారు.


Click it and Unblock the Notifications











