తెలుగులోనూ ఫ్యాన్స్ : సన్నిలియోన్ ప్లెక్సీ పెట్టారు(ఫొటో)
హైదరాబాద్ : హీరోలుకు, హీరోయిన్స్ కు ఫ్లెక్సీలు పెట్టడం, పాలాభిషేకాలు చేయటం మన సౌత్ లో చాలా చాలా కామన్. అయితే ఇప్పుడు సన్నిలియోన్ అభిమాన సంఘం అంటూ కరెంట్ తీగ చిత్రం థియోటర్ వద్ద కట్టిన ప్లెక్సీ అందరినీ ఆకర్షిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా సన్నిలియోన్ ప్లెక్సీలు దర్శనమివ్వటంతో తెలుగులో ఒక్క సినిమానే చేసినా ఆమె క్రేజ్ కు తార్కాణం అంటున్నారు టాలీవుడ్ వాసులు.
కరెంట్ తీగ చిత్రంలో కనిపించింది కాసేపే అయినా మంచి రెస్పాన్సే వచ్చింది. పబ్లిసిటీ సైతం సన్నిలియోన్ పైన కాన్సర్టేట్ చేసారు కరెంట్ తీగ దర్సక,నిర్మాతలు. ప్రోమోలు, పోస్టర్స్ పైనే కాకుండా ఆమెతో చిత్రీకరించిన లే లే లేలేలే నా రాజా పాట మేకింగ్ ని సైతం ముందుగా రిలీజ్ చేసి ప్రాజెక్టుకు క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేసారు. సన్నిలియోన్, మంచు మనోజ్ కాంబినేషన్ అన్నంత హడావిడి చేసారు. ఇప్పుడదే ఎఫెక్ట్ థియేటర్స్ వద్ద కనిపిస్తోంది.

సర్లే మాకింత చేస్తున్న అభిమానుల కోసమూ ఏదో ఒకటి చేయాలని సన్ని ఫిక్స్ అయినట్లుంది.అందుకే ఆమె ట్విట్టర్ లో ఓ పోస్టర్ విడుదల చేసింది.తన అభిమానుల కోసం కృతజ్ఞతగా సన్నీ లియోని దొంగగా మారిందట. అవును ఇది నిజమే. ఏం దొంగతనం చేసింది అనుకుంటున్నారా? తన స్టిల్. ఆమె స్టిల్‌ను ఆమె దొంగతనం చేయడమేంటంటే, ప్రస్తుతం ఈ శృంగారతార 'మస్తీజాదే' అనే హిందీ సినిమాలో నటిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని పోస్టర్లు బయటికొచ్చాయి. వాటిని చూస్తేనే సినిమా ఎంత ఘాటుగా ఉండబోతోందో తెలుస్తోంది. వాటికి మించి అందాల ఆరబోతతో ఉన్న స్టిల్‌ను సన్నీ తన ట్విట్టర్‌లో పెట్టింది. ''చూశారా... నా ఫొటోను. దీన్ని సంజయ్ సర్ కంప్యూటర్ నుంచి కొట్టేశాను. మీ కోసం ట్విట్టర్‌లో పెడుతున్నాను. ఈ షాట్ కోసం ఎంతో కష్టపడ్డాను. అందుకే ముందుగా చూపిస్తున్నాను'' అని రాసుకొచ్చింది.


Click it and Unblock the Notifications











