Robbery: హీరో మోహన్ బాబు ఇంట్లో భారీ చోరీ.. ఎంత దోచుకెళ్లారంటే?
Mohan babu: తెలుగు సినీ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసంతో నగదు, విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఆ చోరీకి పాల్పడింది ఎవరో కాదు. మోహన్ బాబు నివాసంలో పనిచేస్తున్న నాయక్ అనే పనిమనిషి దొంగతనానికి పాల్పడ్డారు.
దాదాపు రూ.10 లక్షలు, విలువైన బంగారు ఆభరణాలతో పారిపోయాడు. ఈ విషయంపై మోహన్ బాబు మంగళవారం రాత్రి రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రాచకొండ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు నాయక్ కోసం గాలింపు చర్యలు చేపట్టి గంట వ్యవధిలోనే కేసును చేధించారు. ఈ క్రమంలోనే అతడిని తిరుపతిలో అదులోకి తీసుకున్నట్లు తెలిసింది.

గతంలోనూ నటుడు మోహన్ బాబు నివాసంలో చోరీ జరిగింది. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో నగదు, ఆభరణాలు కనిపించకుండా పోయినట్లు ఆయన మేనేజర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమకు పనిమనిషి మీదే అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ మధ్యన చిరంజీవి నివాసంలో కూడా ఇదే తరహా చోరీ జరిగింది. ఆ సమయంలో పోలీసులు చిరంజీవి నివాసంలో పనిచేస్తున్న వ్యక్తే చోరీకి పాల్పడ్డాడని పోలీసులు తేల్చారు.


Click it and Unblock the Notifications