ప్రముఖ సినీ నటి మంజుల కన్నుమూత
తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం వాసు. తెలుగు అగ్రహీరోలు అందరితోనూ మంజుల నటించి మెప్పించారు. మాయదారి మల్లిగాడు, దొరబాబు, జేబుదొంగ, పిచ్చిమారాజు చిత్రాల్లో మంజుల నటించారు. తమిళ నటుడు విజయ్‌కుమార్‌తో మంజుల వివాహం జరిగింది. ఆమెకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. దేవి చిత్రంలో మంజుల కూతురు నటించగా, మరో కూతురు శ్రీదేవి హీరోయిన్‌గా నటించారు.
ఎన్టీ రామారావుతో మగాడు, మా ఇద్దరికథ, వాడే వీడు వంటి చిత్రాల్లో, కృష్ణతో మాయదారి మల్లిగాడువంటి చిత్రాల్లో, అక్కినేని నాగేశ్వర రావు సరసన బంగారు బొమ్మలు వంటి చిత్రాల్లో నటించారు. శోభన్ బాబు సరసన ఆమె పలు చిత్రాల్లో నటించారు. శోభన్ బాబు, మంజుల అప్పట్లో హిట్ పెయిర్‌గా గుర్తింపు పొందింది.
తమిళంలో ఆమె శివాజీ గణేషన్, యంజీ రామచంద్రన్, జెమినీ గణేషన్ సరసన నటించింది. 1992లో వెంకటేష్ నటించిన చంటి సినిమాలో హీరోయిన్ మీనాకు వదినగా నటించారు. 2002లో వెంకటేష్ చిత్రం వాసులో మంజుల తల్లిగా నటించారు.


Click it and Unblock the Notifications












