»   » స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ దోరికిపోయిన ఒకప్పటి హీరోయిన్

స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ దోరికిపోయిన ఒకప్పటి హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు నగరంలో ఐటిసి రాయల్ గార్డెనియా (సెవెన్ స్టార్)లో హైటెక్ వ్యభిచారం చేస్తూ నటి యమున బెంగుళూరు సీసీబీ పోలీసులకు దోరికిపోయింది. కన్నడలో రెండు చిత్రాలు, తమిళం, తెలుగులో కూడా పలు చిత్రాలలో యమున హీరోయిన్‌గా నటించడం జరిగింది. కధనం ప్రకారం యమున, ఒక సాప్ట్ వేర్ సంస్ద యజమాని వేణుగోపాల్, మరో దళారిని సీసీబీ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.

హూటల్ ‌లో వ్యభిచారం జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా సీసీబీ పోలీసుల అధికారి కృష్ణం రాజు, సహాయక పోలీసు కమిషనర్ అలోక్ కుమార్ నేతృత్వంలోని పోలీసు బృందం గురువారం రాత్రి 9.45కు సదరు హూటల్‌కు వెళ్శారు. నేరుగా నాలుగో అంతస్తులో ఉన్న నటిని, విటున్ని అదుపులోకి తీసుకున్నారు.

మరో గదిలో కూర్చోని ఉన్న దళారిని అరెస్టు చేశారు. ఈరాకెట్ వెనుక ఎవరెవరు ఉన్నారో గుర్తించేందుకు సీసీబీ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. విచారణ పూర్తియితే మరికోందరి పేర్లు వెలుగు చూస్తాయని సీసీబీ పోలీసులు భావిస్తున్నారు. ఇక మయన విషయానకి వస్తే తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి పుట్టింటి పట్టుచీర, దాసరినారాయణరావు దర్శకత్వం వహించినటువంటి మామగారు లాంటి సినిమాలలో హీరోయిన్‌గా నటించారు. ఆతర్వాత కాలంలో ఎదురులేని మనిషి, భగీరధుడు, మనసు పిలిచింది లాంటి సినిమాలలో సహాయనటిగా నటించారు. ఇక కన్నడ విషయానికి వస్తే కన్నడ సినిమాలలో హీరోలు శివరాజ్ కుమార్, రవిచంద్రన్ సరసన హీరోయిన్‌గా నటించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu