నిర్మాత వాకాడ అప్పారావు పచ్చి కామాంధుడు: శ్రీరెడ్డి సమక్షంలో ఆర్టిస్టుల ఆరోపణ
Recommended Video

శ్రీరెడ్డి చూపిన ధైర్యంతో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్న పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు తమ గళం విప్పుతున్నారు. తాము ఎదుర్కొన్న చేదు సంఘటనల గురించి, ఇండస్ట్రీలో కామాంధుల గురించి ధైర్యంగా బయటకు చెబుతున్నారు. తాజాగా మహాటీవీ చర్చా కార్యక్రమంలో శ్రీరెడ్డితో పాటు పాల్గొన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు శృతి, శ్రీవాణి తదితరులు నిర్మాత వాకాడ అప్పారావు గురించి సంచలన విషయాలు బయట పెట్టారు. అతడిపై తీవ్ర ఆరోపణలు చేశారు.

పచ్చి కామాంధుడు
తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నిర్మాత వాకాడ అప్పారావు పచ్చి కామాంధుడని, పడుకుంటనే అవకాశాలు ఇస్తానని డైరెక్టుగా మాట్లాడతాడని పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు మహాటీవీ చర్చా కార్యక్రమంలో ఆరోపణలు చేశారు.

చిరంజీవి సినిమా అవకాశం కోసం వెళితే....
ఖైదీ నెం 150 సినిమా సమయంలో అవకాశం కోసం ఆఫీసుకు ఫోటో తీసుకుని వెళ్లాము. ఫోటో వెనకాల ఫోన్ నెంబర్ రాసి అక్కడ ఇచ్చాము. అయితే అక్కడ ఆఫీసులో ఒక వ్యక్తి అందరూ ఫోటోస్ ఇస్తున్నారు, మాకు చూసే టైమ్ కూడా ఉండటం లేదు అని చెప్పి.... ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాకాడ అప్పారావుతో మాట్లాడాలని చెప్పి అతడి నెంబర్ ఇచ్చాడు. ఆయనకు ఫోన్ చేసి చిరంజీవి సినిమాలో అవకాశం ఇప్పించండి సార్ అని అడిగితే.... నీ వయసు ఎక్కువగా ఉంది, ఎవరైనా వయసులో ఉన్న అమ్మాయిని సెట్ చేస్తే మీ వయసుకు తగ్గ క్యారెక్టర్ ఇప్పిస్తాను అన్నాడు... అని క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీవాణి ఆరోపించారు.

ఇదంతా కామన్ అని ఒప్పించే ప్రయత్నం
ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు, మేమే నటించడానికి వచ్చాము, చిరంజీవి గారి సినిమాలో ఒక్క క్యారెక్టర్ అయినా చేయాలని ఆశతో వచ్చాము.. మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పాం. అపుడు దానికి అతడు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాను. ఇదంతా కామన్.... ఇది లేనిదే క్యారెక్టర్ ఉండదు. మీరు కొత్తవారు కాబట్టి మీకు తెలియక పోవచ్చు. ఇంతకు ముందు ఉన్న సీనియర్ ఆర్టిస్టులను ఎవరినైనా అడగండి అన్నారు. పడుకుంటే వచ్చే ఆఫర్ తనకు వద్దని వెళ్లి వచ్చానని ఆమె మహాటీవీ చర్చా కార్యక్రమంలో వెల్లడించారు.

చాలా మందిని వేధించాడు
ఇండస్ట్రీలో అవకాశాల కోసం వెళ్లే చాలా మందిని వాకాడ అప్పారావు వేధించాడని, పడుకుంటేనే అవకాశాలు అంటూ పలువురిని తన చుట్టూ తిప్పుకున్నాడని మహాటీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆరోపించారు.

14 నుండి 20 ఏళ్ల అమ్మాయిలే కావాలంటాడు
వయసు ఎక్కువగా ఉన్న వారు ఎవరైనా అవకాశాల కోసం వెళితే.... వయసులో ఉన్న 14 నుండి 20 ఏళ్ల అమ్మాయిని తన వద్దకు పంపితేనే మీకు అవకాశాలు ఇస్తానని వాకాడ అప్పారావు అడుగుతుంటాడని మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ శృతి ఆరోపించారు. ఈ చర్చాకార్యక్రమం జరుగుతుండగానే పలువురు ఫోన్లు చేసి వాకాడ అప్పారావు మీద ఆరోపణలు గుప్పించారు.

నేను ఎవరినీ కమిట్మెంట్ అడగలేదని చెప్పిన వాకాడ అప్పారావు
అయితే ఈ చర్చకార్యక్రమం జరుగుతుండగానే నిర్మాత వాకాడ అప్పారావు ఫోన్ ద్వారా లైన్లోకి వచ్చారు. తనపై క్యారెక్టర్ ఆర్టిస్టులు చేస్తున్న ఆరోపణలు ఖండించారు. తాను ఎప్పుడూ ఎవరినీ కమిట్మెంటు అడగలేదని, తాను అలాంటి వాడిని కాదని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











