'రోబో' చిత్రం పై తెలుగు స్టార్స్ కామెంట్స్
రజనీకాంత్, శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన రీసెంట్ చిత్రం రోబో..ఊహించని రేంజిలో విజయవంతం అయింది. ఈ విషయాన్ని తెలుగు పరిశ్రమలోని ప్రముఖులు పలు రకాలుగా స్పందించారు. త్వరలో ఖలేజా తో మన ముందుకు రాబోతున్న మహేష్ బాబు స్పందిస్తూ...రోబో చూశాను. ఒక్క మాటలో చెప్పాలంటే వావ్ అన్నారు. ఇక వెంకటేష్ తాజాగా తన పిల్లాడికి రోబో ఫీవర్ పట్టుకుందంటూ...రోబోటిక్, హిప్నాటిక్, హిప్నాటిక్, సూపర్ సానిక్...సూపర్ స్టార్ కమ్ కమ్ గెట్ ఇట్...గత కొన్ని గంటలుగా మా అబ్బాయి అర్జున్ ఇదే పాట పాడుతున్నాడు. వాడికి రోబో ఫీవర్ పట్టుకుంది...అన్నారు వెంకటేష్.
మగధీరతో గ్రాఫిక్స్ చూపి హిట్ కొట్టి మరో గ్రాఫిక్ ఫిలిం ఈగ కు రెడీ అవుతున్న రాజమౌళి మాట్లాడుతూ...ఏ దర్శకుడు పట్టలేనంతగా శంకర్ ప్రేక్షకుల నాడి పట్టారు. ఆయన ఊహకు హేట్సాఫ్ అన్నారు. ఇక గాయని,నటి అయిన మమతా మోహన్ దాస్ స్పందిస్తూ...బోర్న్ రజనీ, బాండ్ రజనీ, రజనీనేటర్, రజనిక్స్ రీలోడెడ్, ఫాస్ట్ అండ్ రజనియస్...ఇవన్నీ ఉన్న ఏకైక సినిమా రోబో మిస్ చేయొద్దు అంటూ ఎక్సైట్మెంట్ తో చెప్పుకొచ్చిది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల అయితే...ఇట్స్ ఎ స్పెక్టక్యుల్ అన్నారు.
ఇక దేశముదురు భామ హన్సిక ఈ చిత్రం...గ్రేట్ డెరైక్టర్ + గ్రేట్ హీరో = రోబో. అందరూ ఈ సినిమాని చూడండి అంది. మరో నటుడు ప్రకాష్ రాజ్ అయితే...హేట్సాఫ్ టు రజనీ అండ్ శంకర్. ప్రకాష్‌రాజ్ అన్నారు. మోహన్ బాబు కుమార్తె...ఝమ్మంది నాదంతో నిర్మాతగా మారిన లక్ష్మీ ప్రసన్న...గొప్ప విజువల్ ట్రీట్ రోబో రజనీకాంత్ ఏకైక సూపర్ స్టార్ అంది. ఆమె తండ్రి మోహన్ బాబు, రజనీకాంత్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. ఇక సమంత, రిచా, త్రిష, నిఖిల్,రానా వంటి స్టార్స్ అందరూ తమ దైన రీతిలో రోబోని ప్రశంసించారు.


Click it and Unblock the Notifications











