'రోబో' కి రచ్చ చేసారు...'ఖలేజా' కి సైలెంట్ అయ్యారు
రజనీకాంత్ 'రోబో' గురించి పోటీలు పడి మరీ ట్విట్టర్లోనూ మీడియా వద్ద ఊదరకొట్టిన మన తెలుగు దర్శకులు, హీరోలు ఎవరూ కూడా మహేష్ తాజా చిత్రం గురించి నోరెత్తటం లేదు. ఈ విషయం పరిశ్రమలోని కొన్ని వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య కాలంలో పెద్ద స్టార్ సినిమా రిలీజ్ కాగానే..మీ సినిమా బాగుందంటే...మీరు అద్బుతంగా యాక్ట్ చేసారు..ఆహా మీ దర్శకత్వం సూపర్ అంటూ కంటిన్యూగా ట్వీట్ చేసుకుంటూ ఒకర్నినొకరు అభినందించుకున్నారు. అలాంటి ఈ బ్యాచ్ మొత్తం సైలెంట్ అవటానికి కారణం ఏమిటో అర్దం కావటం లేదంటున్నారు. అలాగే కొందరు ఖలేజా డివైడ్ టాక్..యావరేజ్ అంటున్నా..మరికొందరు ఒప్పుకోవటం లేదు.
దాంతో సినిమా హిట్టని ట్విట్టర్ లో పెడితే కావాలని డబ్బా కొట్టినట్లవుతుంది. పోనీ బాగాలేదు అని పెడితే లేనిపోని తలనొప్పి అని సైలెంట్ గా అస్సలు ఆ సినిమా రిలీజైనట్లే ఎవరూ మాట్లాడటం లేదు..ట్వీట్ చేయటం లేదు. నిఖిల్ ఒక్కడే ఖలేజా గురించి రాస్తూ...ఫస్టాఫ్ చూసా...మహేష్ ది రచ్చ యాక్టింగ్..హిలేరియస్ ఫస్ట్ హాఫ్..ప్రిన్స్ కొత్తగా ఉన్నాడని పెట్టాడు..అంతేగాని సినిమా పూర్తయ్యాక...ఏమిటి పూర్తి రిజల్టు అన్నది మాత్రం ఇవ్వలేదు. అలాగే ప్రతీ విషయాన్ని ట్విట్టర్ లో విశ్లేషించే అల్లు శిరీష్ కూడా ఈ సారి ఖలేజా పై నో కామెంట్ అన్నట్లున్నాడు. ఇక రీసెంట్ గా ప్రతీ విషయమపై స్పందిస్తున్న రాజమౌళి కూడా ఖలేజా పై సైలెంట్ గా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











