ముగిసిన ఫిలిం ఛాంబర్ స్పెషల్ కమిటీ భేటీ.. ఎటూ తేలక పోవడంతో మరోసారి?
టాలీవుడ్ లో షూటింగ్‌లు కొనసాగుతాయా లేదా బంద్ అవుతాయా అనే విషయం మీద ఇంకా డైలమా కొనసాగుతోంది. ఆగస్టు 1వ తేదీ నుంచి తెలుగు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ షూటింగులు నిలిపివేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫిల్మ్ ఛాంబర్ లో బుధవారం నాడు స్పెషల్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, ఫెడరేషన్ సభ్యులు కూడా హాజరయ్యారని తెలుస్తోంది. షూటింగ్ లు బంద్ చేయడం గురించి, నిర్మాతల సమస్యలపై చర్చించారని అంటున్నారు. అయితే షూటింగ్ ల బంద్ పై ఎటూ నిర్ణయం తీసుకోలేదు. చర్చలు ఎంతకూ తెగకపోవడంతో ఈ నెల 30న మరోసారి సమావేశం కావాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది.
ఇక ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన సమావేశానికి హాజరైన నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, ఫెడరేషన్ సభ్యులు ముఖ్యంగా కాస్ట్ కటింగ్, ఓటీటీ , ఫిలిం ఫెడరేషన్ సమస్యలపై చర్చించినట్లుగా చెబుతున్నారు. అనేక దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత ప్రొడ్యూసర్స్ గిల్డ్ సినిమా షూటింగ్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు తదుపరి చర్చలు, సమస్యల పరిష్కారానికి పరిష్కారాల కనుగొనే వరకు వరకు షూటింగ్స్ కూడా నిలిపివేయాలని నిర్ణయించారు. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న క్రమంలో సినిమా షూటింగ్‌లను నిలిపివేయాలనే నిర్ణయం చిరంజీవి మొదలు అనేక మంది స్టార్ హీరోల చిత్రాలపై ప్రభావం చూపనుంది.

ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. షూటింగ్‌ల బంద్ నిర్ణయంపై అగ్ర హీరోలు రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్‌తో చర్చలు జరిపారనే వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ విషయం మీద ఆరా తీసినట్టు చెబుతున్నారు. అయితే దిల్ రాజు ప్రమేయంతో ఈ విషయంలో తాము రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి కూడా ముగ్గురు హీరోలు ముందుకొచ్చినట్లుగా ఫిలింనగర్ లో వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సినిమా బడ్జెట్ కంట్రోల్‌లో భాగంగా రెమ్యూనరేషన్లు తగ్గించుకుంటామని, ఖచ్చితంగా అన్ని విషయాల్లో కూడా సహకరిస్తామని ఆ హీరోలు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక తమతో సినిమాలు చేస్తున్న హీరోలతో కూడా చర్చలు జరుపుతామని నిర్మాతలు చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారం మీద ఎప్పటికి కలర్ వస్తుందో వేచి చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











