Film Chamber ఎన్నికలకు సర్వం సిద్ధం.. పోటీలో అగ్ర నిర్మాతలు.. ఆరోజే ఎలక్షన్స్!
తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు వినోదం అందించేవి సినిమాలు. ఈ సినిమాల్లో కూడా రాజకీయాలు ఉంటాయనే విషయం తెలిసిందే. మొన్నటివరకు మా (MAA) ఎలక్షన్స్ హాట్ టాపిక్ అయ్యాయి. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కు మెగాస్టార్ చిరంజీవి వర్గం సపోర్ట్ చేయగా.. ప్రత్యర్థిగా మంచు విష్ణు పోటీ పడి అధ్యక్ష పదవి చేపట్టాడు. ఇప్పుడు మరోసారి ఎన్నికల వేడి తగలనుంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల హడావిడి అప్పుడే మొదలైంది. మరి ఈ ఎలక్షన్స్ లో అధ్యక్ష పదవి కోసం పోటీలో ఎవరెవరూ ఉన్నారనే వివరాల్లోకి వెళితే..
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ (Telugu Film Chamber Of Commerce) ఎన్నికల హడావిడి మొదలైంది. ఫిల్మ్ ఛాంబర్ (Telugu Film Chamber) ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ నెల అంటే జూలై 30న ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇదే నెల జూలై 14 తేది వరకు నామినేషన్స్ స్వీకరించనున్నారు. అలాగే జూలై 21 నామినేషన్ విత్ డ్రాకు ఆఖరు తేదిగా ప్రకటించారు.

ఇక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అందులో అధ్యక్ష పదవికి ఎవరు పోటీ పడనున్నారను అనే ఆసక్తి నెలకొంది. ఇందులో ప్రముఖ అగ్ర నిర్మాతలే బరిలోకి దిగనున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవి కోసం సి. కల్యాణ్ (C. Kalyan), దిల్ రాజు (Dil Raju) బరిలోకి దిగినట్లు వీరిద్దరు పేర్లు గట్టిగా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ఛాంబర్ కు కే. బసిరెడ్డి అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవి కోసం చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ, ప్రధానంగా నిర్మాతలు సి. కల్యాణ్, దిల్ రాజు పేర్లు కీలకంగా మారాయి. కాగా సి. కల్యాణ్ ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో శాఖల్లో కీలక పదువులు చేపట్టి సేవలందించారు. అంతేకాకుండా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడంట్ గా కూడా వర్క్ చేశారు. ఇక టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో కీలకంగా దిల్ రాజు ఉన్నారు. వీరిద్దరు బరిలోకి దిగితే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు వాడివేడీగా ఉంటాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications











