Film Chamber Election: ముగిసిన TFCC ఎన్నికలు.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలుగు సినీ పరిశ్రమలో వినోదంతోపాటు ఉత్కంఠత కలిగించే రాజకీయాలు కూడా ఉంటాయి. మొన్నటివరకు మా (MAA) ఎలక్షన్స్ హాట్ టాపిక్ కాగా ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు (Telugu Film Chamber Of Commerce Election) రసవత్తరంగా సాగుతూ హీట్ పెంచుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఇద్దరు అగ్ర నిర్మాతలైన సి. కల్యాణ్ (C. Kalyan), దిల్ రాజు (Dil Raju) మధ్య గట్టి పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ నిర్వహించిన ఈ ఎన్నికల్లో ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారనే లెక్కలపై ఓ లుక్కేస్తే..
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (Telugu Film Chamber Of Commerce) ఎన్నికల హడావిడి తుది అంకానికి చేరుకుంది. జూలై 11న నోటిఫికేషన్ విడుదల కావడంతో ఊపందుకున్నాయి ఈ ఎన్నికలు. జూలై 14న తేది వరకు నామినేషన్స్ స్వీకరణ, జూలై 21 వరకు అదే నామినేషన్ల విత్ డ్రా తేదిని ప్రకటించగా.. ఇవాళ అంటే జూలై 30 ఆదివారం రోజున ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎలక్షన్స్ లలో పేరొందిన సి. కల్యాణ్, దిల్ రాజు నిర్మాతలు పోటి పడ్డారు.

జూలై 30న ఉదయం 8 గంటలకు మొదలైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు (TFCC Election 2023) మూడున్నర గంటలకు ముగిసింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. అలాగే 6 గంటలకు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫిలీం చాంబర్ లో మొత్తం 1600 మంది సభ్యులు ఉండగా.. 900 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు సమాచారం. నాలుగు సెక్టార్ లలోని సభ్యులు ఓట్లు వేశారు.
దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నటులు రాజేంద్ర ప్రసాద్, నాగినీడు, బెనర్జీ, అశోక కుమార్, నటి జీవితా రాజశేఖర్ సహా పలువురు నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. ఇక స్టూడియో సెక్టార్ లో మొత్తం 98 ఓట్లకు 68 ఓట్లు పోలయ్యాయి. అలాగే డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ మొత్తం 597 ఓట్లకు 380 ఓట్లు నమోదు అయ్యాయి. ఇక ప్రొడ్యూసర్ సెక్టార్ లో మొత్తంగా 1567 ఓట్లు ఉండగా.. 891 ఓట్లు పోలియన్లు సమాచారం.


Click it and Unblock the Notifications











