శరత్ లైఫ్ స్టైల్ చాలా రిచ్.. రోజుకో కొత్త ప్యాంట్-షర్ట్.. చేతిలో 555 సిగరెట్.. కానీ అదొక్కటే వెలితన్న కాశ
టాలీవుడ్ సీనియర్ దర్శకుడు శరత్ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ఈ తరం వారికి అంతగా తెలియక పోవచ్చు కానీ, శరత్ తెరకెక్కించిన సూపర్ హిట్స్ పేరు వింటే ఈ సినిమాలకు ఆయనా దర్శకుడు అని ముక్కున వేలేసుకుంటారు. బాలకృష్ణతో పెద్దన్నయ్య, వంశానికొక్కడు, సుమన్ తో బావ-బావమరిది, పెద్దింటల్లుడు, చిన్నల్లుడు వంటి విజయవంతమైన సినిమాలు రూపొందించిన ఆయన మరణించడంతో ఆయన శిష్యుడు ఒకప్పటి దర్శకుడు, ఇప్పటి నటుడు కాశీ విశ్వనాధ్ స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

మంచి దర్శకునిగా
చదువుకునే రోజుల్లోనే ఎన్టీఆర్, ఏయన్నార్ సినిమాలు చూస్తూ సినీ పరిశ్రమ మీద ఆసక్తి పెంచుకున్న శరత్ మద్రాసు వెళ్లి పి.సాంబశివరావు, ఎ.కోదండరామిరెడ్డి వంటి దర్శకుల వద్ద అసోసియేట్ గా పనిచేశారు. ఎక్కువగా కోదండరామిరెడ్డి తెరకెక్కించిన పలు నవలా చిత్రాలకు శరత్ పనిచేయడంతో సూర్యదేవర రామ్మోహన రావు రాసిన డియర్ అనే నవల ఆధారంగా చాదస్తపు మొగుడు తెరకెక్కించిన మొదటి చిత్రంతోనే మంచి దర్శకునిగా పేరు తెచ్చుకున్నారు.

హిట్ మూవీస్
ఆ తరువాత సుమన్ హీరోగా రూపొందిన పెద్దింటల్లుడు, బావ-బావమరిది వంటి హిట్ మూవీస్ కూడా శరత్ రూపొందించారు. బావ-బావమరిది వంటి సూపర్ హిట్ తరువాత బాలకృష్ణతో శరత్ రూపొందించిన వంశానికొక్కడు, పెద్దన్నయ్య,సుల్తాన్, వంశోద్ధారకుడు వంటి చిత్రాలు కూడా ఆకట్టుకున్నాయి. అలాగే కృష్ణతో సూపర్ మొగుడు రూపొందించిన శరత్, ఏయన్నార్ తో కాలేజీ బుల్లోడు కూడా తెరకెక్కించారు.

ఆసక్తికర విషయాలు
ఆరంభంలో వరుస విజయాలు చవిచూసిన శరత్ కు తరువాతి రోజుల్లో పరాజయాలు పలకరించాయి. ఆయన దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం శ్రీహరి హీరోగా నటించిన ఎవడ్రా రౌడీ?. ఆ తరువాత శరత్ ఏ చిత్రానికీ దర్శకత్వం వహించలేదు. ఆయన పెళ్లి కూడా చేసుకోకుండానే ఉండిపోయారు. శరత్ మృతి పట్ల నందమూరి బాలకృష్ణ, సుమన్, కాట్రగడ్డ ప్రసాద్, ఏ.కోదండరామిరెడ్డి వంటి సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేయగా ఆయన శిష్యుడు కాశీ విశ్వనాధ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

చాలా రిచ్‌గా
సీనియర్ దర్శకుడు శరత్ వద్ద ఒకప్పుడు శిష్యుడిగా పని చేసిన నటుడు, దర్శకుడు, ప్రస్తుత టాలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యనమదల కాశీ విశ్వనాథ్ ఆయన లైఫ్ స్టయిల్ గురించి ఫేస్‌బుక్ వేదికగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తమ గురువు గారైన శరత్ గారు చనిపోవడం.. ఎంతో బాధాకరమైన విషయమని, ఆయన దగ్గర నేను దాదాపు 10 సంవత్సరాలు.. అసోసియేట్ గా, కో-డైరెక్టర్ గా పని చేశానని అన్నారు.

చాలా రిచ్‌గా
ఆయన తనని శిష్యుడిలా కాకుండా.. సొంత బ్రదర్ లా చూసుకున్నారు. ఛాదస్తపుమొగుడు, మామాశ్రీ, పెద్దింటల్లుడు, కలెక్టర్ గారి అల్లుడు, దొంగల్లుడు, కాలేజీ బుల్లోడు, భలే బుల్లోడు, వంశానికొక్కడు.. సినిమాలకు ఆయన దగ్గర పని చేశానని అన్నారు. ఆయన లైఫ్ స్టయిల్ చాలా రిచ్‌గా వుండేదన్న విశ్వనాధ్ . చేతిలో 555 సిగరెట్ పేకెట్, ఫియెట్ కారు, రోజుకో కొత్త ప్యాంట్-షర్ట్‌తో ఆదర్శవంతంగా బతికారని అన్నారు.
Recommended Video


ఇస్త్రీ చేసి ట్రెయిన్‌లో
ఆ రోజుల్లో.. ఆయన బట్టలు.. విజయవాడలో ఇస్త్రీ చేసి ట్రెయిన్‌లో వచ్చేవని ఆయన గుర్తు చేసుకున్నారు. సీను పేపర్ ఒక్కసారి చూస్తే.. చాలు ఒక్క షాట్ కూడా మిస్ అవ్వకుండా అద్భుతంగా తీసేవారని అన్నారు. ఒక్క పెళ్లి చేసుకోలేదనే వెలితి తప్ప ఆయన జీవితం పరిపూర్ణం.'' అంటూ కాశీ విశ్వనాథ్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











