»   » కేసీఆర్‌కు సహకరిద్దాం, హైద్రాబాద్ లోనే పరిశ్రమ: దాసరి

కేసీఆర్‌కు సహకరిద్దాం, హైద్రాబాద్ లోనే పరిశ్రమ: దాసరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ సినిమా హబ్ గా చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన ఆలోచన ఎంతో బావుంది. అందరం ఆయనకు సహకారం అంద్దాం...అని వ్యాఖ్యానించారు దర్శకరత్న దాసరి నారాయణరావు. తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్ శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీ స్థాయిలో నిర్వహించిన ‘మేడే ఉత్సవాలు'కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయినా....తెలుగు చిత్రపరిశ్రమ ఎక్కడికీ వెళ్లదు, హైదరాబాద్‌లోనే ఉంటుందని ముందు చెప్పాను. మనం కళాకారులం. కళాకారులకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. చట్టబద్దంగా ఎవరు ఏ సంఘం ఏర్పాటు చేసుకున్నా ఐక్యమత్యంగా ముందుకు వెళ్లాలి అని దాసరి వ్యాఖ్యానించారు.

Telugu Film Fedaration May Day Celebrations

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ...తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు అన్నిరకాల సహకారం అందిస్తుంది. కార్మికులకు కళ్యాణ లక్ష్మి, పెన్షన్ పథకాల్ని వర్తింపజేసే ప్రయత్నం చేస్తున్నా. కొంత మంది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఉందనే విషయం మరిచి పోయి చంద్రబాబు చుట్టు తిరుగుతున్నారు. ఏదైనా ఇబ్బంది వస్తే మొదట వచ్చేది మేమే అన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి అన్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ్‌ భావోద్వేగంతో మాట్లాడుతూ ‘అనామకుణ్ణయిన నన్ను ఇంతవాణ్ణి చేసింది కార్మికులు, ఫెడరేషన్‌. చాలాసార్లు నేను చనిపోయే పరిస్థితుల్లో నన్ను కాపాడింది మీరు. మీరే నా దేవుళ్లు, మీరే నా తల్లిదండ్రులు' అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.

మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ‘మా' అధ్యక్షుడిగా గెలిచాక కేసీఆర్ గారినికలిసాను. మీకు ఎప్పుడు, ఎలాంటి అవసరం వచ్చినా మొహమాట పడకుండా అడగండి..తన సహకారం అందిస్తాను' అన్నారు. ఆయనను కలవక ముందుకీ, ఆయనను కలిసిన తర్వాతకీ నా అభిప్రాయం మొత్తం మారిపోయింది' అని చెప్పారు.

English summary
Telugu Film Fedaration May Day Celebrations held at Annapurna Studios.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu