15న ‘తెలుగు చలన చిత్రోత్సవం’
ఈ నెల 15న తెలుగు చలన చిత్రోత్సవం జరుగనుంది. తొలి తెలుగు టాకీ చిత్రం 'భక్తప్రహ్లాద" విడుదలై ఈ నెల 15కు ఎనభై ఏళ్లు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక నుంచి ప్రతి ఏడాదీ సెప్టెంబర్ 15న 'తెలుగు చలనచిత్ర దినోత్సవం" నిర్వహించాలని చలన చిత్ర ప్రముఖులు నిశ్చయించారు. ఈ ఏడాది సమయాభావం వల్ల వేడుకలను ఘనంగా నిర్వహించలేకపోతున్నాం. వచ్చే ఏడాది నుంచి ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తామని మురళీ మోహన్ తెలిపారు.
అదే విధంగా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ఓ ప్రత్యేకమైన జెండాను రూపొందించి, దానిని ప్రతి ఏటా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆవరణలో ఎగురవేస్తామన్నారు. 80 ఏళ్ల సినిమాపై అవగాహన కలిగించే విధంగా ఓ వెబ్‌సైట్‌ని ప్రారంభించనున్నామని, తెలుగు సినిమాకు సంబంధంచిన అన్ని విషయాలూ అందులో ఉంటాయని సి.కళ్యాణ్ చెప్పారు.


Click it and Unblock the Notifications











