హార్ట్ స్ట్రోక్ తో ఫైట్‌మాస్టర్ రాజు మృతి
ప్రముఖ సినీ ఫైట్ మాస్టర్ రాజు ఇక లేరు. ఎన్టీఆర్, చిరంజీవి,బాలకృష్ణ వంటి స్టార్ హీరోల చేత ఫైట్స్ చేయించి ఎంతో పేరు తెచ్చుకున్న చీరాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో హార్ట్ ఎటాక్ కి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆదివారం తెల్లవారు ఝామున మరణించారు. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం వేటపాలెం తరలిస్తున్నారు.అక్కడే కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు జరగనున్నాయి. కొన్ని వందల చిత్రాలకు ఫైట్ మాస్టర్ గా చేసిన ఆయన ముంబయి నుంచి ఫైటర్స్ దిగుమతి చేసుకునే కాన్సెప్ట్ కు నాంది పలికారు. అలా వచ్చిన వారిచేత రకరకాల ఫీట్స్ చేయించి ప్రేక్షకులను అలరించారు. ఒకానొక టైమ్ లో దాదాపు అన్ని తెలుగు సినిమాలకూ ఆయనే ఫైట్స్ సమకూర్చి పూర్తి స్ధాయి బిజీగా ఉన్నారు. అయితే ఈ మధ్య వయస్సు మీదపడటం, కొత్త కొత్త వారు ఫైట్ మాస్టర్స్ గా సక్సెస్ అవటంతో ఆయన ఖాళీగా ఉన్నారు. అయితే తెలగు సినిమా తెలుసున్న ప్రతీ ఒక్కరికీ ఫైట్ మాస్టర్ రాజు తెలుసు అనటంలో అతిశయోక్తి లేదు. ఆయన మృతికి ధట్స్ తెలుగు ప్రగాఢ సంతాపం తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications











