»   » తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉత్సవాలు

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉత్సవాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మే 1, ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉత్సవాలను కొమర వెంకటేష్ అధ్యక్షతన అన్నపూర్ణ సెవెన్ ఏక్రర్స్ లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హజరుకానున్నారు.

Telugu Film Industry Employees Federation Celebrations

ఈ సందర్భంగా... సెక్రటరీ రాజేశ్వర్ రెడ్డి, ప్రధాన సలహాదారు కాదంబరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ‘తెలుగు సినీ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉత్సవాలను ఈ మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో ఘనంగా నిర్వహించనున్నాం. ఈ కార్యక్రమానికి 15000 మంది సినీ కార్మికులు హారవుతున్నారని తెలిపారు.

Telugu Film Industry Employees Federation Celebrations

ఈ కార్యక్రమంలో తెలంగాణా సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాసయాదవ్ గారితో పాటు దర్శకరత్న దాసరినారాయణరావుగారు, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్, ఛాంబర్ ప్రెసిడెంట్ ఎన్.వి.ప్రసాద్, బూరుగుపల్లి శివరామకృష్ణ, పరుచూరి బ్రదర్స్ సహా ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులందరూ హాజరుకానున్నారు. ఎన్నడూ ఎరుగని రీతిలో చాలా ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటశ్రీనివాసరావు సహా తెలుగు సినిమాలో ప్రముఖ వ్యక్తులకు ఆత్మీయ సత్కారం చేయనున్నాం' అన్నారు.

English summary
Telugu Film Industry Employees Federation Celebrations on May 1st.
Please Wait while comments are loading...