»   » బండ్ల గణేష్ భారీ సినిమాలు తీయడం వెనక...?

బండ్ల గణేష్ భారీ సినిమాలు తీయడం వెనక...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన బండ్ గణేష్ ఒక్కసారిగా బడా నిర్మాత అవరతం ఎత్తి భారీ సినిమాలు తీయడంతో చాలా మందిలో అనుమానాలు మొదలయ్యాయి. ఆయన కొందరు స్టార్ హీరోలు, రాజకీయ నాయకులక బినామీ అని...వారు పెట్టుబడి పెట్టి ఈయనతో సినిమాలు తీయిస్తున్నారనేది టాక్. ఆ మధ్య గణేష్ బొత్సా సత్యనారాయణ బినామీ అనే వార్తలు సైతం హల్ చల్ చేసాయి.

అయితే ఇటీవల ఓ ఇంట్వర్యూలో ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు బండ్ల గణేష్. తాను ఎవరికీ బినామీ కాదని, ఆ ప్రచారం అంతా ట్రాష్ అని కొట్టి పారేసారు. నేను బినామీ అయితే తన ‘పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్' సంస్థ 50 లక్షల అప్పుల్లో ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో స్టార్ హీరోల డేట్స్ సంపాదిస్తే చాలు....చాలా మంది ఫైనాన్స్ చేసారు. సినిమా పూర్తయిన తర్వాత మళ్లీ ఆ డబ్బు కట్టేయొచ్చు. నేను చేసే పని అదే' అని చెప్పుకొచ్చారు.

Telugu Film industry is hero centric: Bandla Ganesh

నేను ఒకప్పుడు సినిమాల్లో చిన్న పాత్రలు చేసాను. కానీ మాది పేద కుటుంబం ఏమీ కాదు. మా తండ్రి 1983 నుండి పౌల్ట్రీ వ్యాపారంలో ఉన్నారు. తెలంగాణలోనే అతి పెద్ద పౌల్ట్రీ ఫామ్స్ మాకు ఉన్నాయి. సినిమా అనేది వ్యాపారం. ఇక్కడ నేను వ్యాపారం చేస్తున్నాను. ఎవరికీ బినామీని కాదు అన్నారు. తాను స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుండటం వల్లనే ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వచ్చాయని గణేష్ చెప్పుకొచ్చారు.

ఇటీవలే ‘టెంపర్' చిత్రం నిర్మించి హిట్టుకొట్టిన బండ్ల గణేష్ ప్రస్తుతం...ఇంకా ఏ సినిమాలు కమిట్ కాలేదు. ప్రస్తుతం స్టార్ హీరోలు ఎవరూ ఖాళీగా లేక పోవడంతో వారి డేట్స్ కోసం బండ్ల గణేష్ ఎదురు చూస్తున్నారు. ఎవరైనా స్టార్ హీరో డేట్స్ దొరికిన వెంటనే అతని సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

English summary
"My banner Parameswara Art Productions owes 50 lakhs debts to financiers now. If I'm a benami of someone, why these 50 lakhs debts then?" Bandla Ganesh said. indicates that Telugu Film industry is hero centric and that's why he keeps buzzing around the leading heroes.
Please Wait while comments are loading...