‘సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వంతో ఇబ్బంది లేదు’
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమ ఎక్కడికీ తరలి వెళ్లదని, హైదరాబాద్ లోనే ఉంటుందని మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్ అన్నారు. 'ఆంధ్రలోనూ, తెలంగాణలోనూ తెలుగువారే ఉన్నారు. మాకు తెలుగు వారందరూ కావాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా వెళ్లమని అనదు. హిందీ సినిమా షూటింగ్‌లు ఎక్కడెక్కడో జరుగుతున్నాయి. అదే మాదిరే తెలుగు షూటింగ్‌లు కూడా జరుగుతాయి అన్నారు.
హైదరాబాద్‌లోని జయభేరి క్లబ్‌లో గురువారం రాత్రి జరిగిన '33 ప్రేమ కథలు' ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడా రు. సినిమా వాళ్లకు జాతి, కులం, మతం అన్న భావం లేదని, తమకు అందరూ కావాలని ఆయన తెలిపారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు పరిశ్రమ తరలింపునకు దశాబ్దం పైగా సమయం పట్టిందని, అయినా ఇంకా సంగీతానికి, నృత్యాలకు, ఫైట్స్‌కు సం బంధించి ముంబై, చెన్నైల నుంచి సహకారం పొందుతూనే ఉన్నారని చెప్పారు.

ప్రతి చిన్న విషయానికి పొరుగు నుంచి కళాకారులను తెచ్చుకోవడం తెలుగు పరిశ్రమలో పరిపాటి అయిందని, మన దగ్గర గల అనేక మంది ప్రతిభావంతులను ప్రోత్సహించాలని, మంచి శిక్షణ ఇస్తే ఇక్కడ కూడా చాలా మంది ప్రతిభావంతులు తయారవుతారని చెప్పారు. ఇటీవల తాను ఎక్కడికి వెళ్లినా సినీ పరిశ్రమ తరలింపుపై చాలా మంది ప్రశ్నిస్తున్నారని, పరిశ్రమ ఎక్కడికీ వెళ్లడం లేదని, అయినా వెళ్లాల్సిన అవసరం ఏముందని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications